CPI: ఖైదీలను విడుదల చేయాలి
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:57 AM
ఏళ్ల తరబడి జైలుశిక్ష అను భవిస్తున్న ఖైదీలను రిప బ్లిక్ డే సందర్భంగా విడు దల చేయాలని సీపీఐ నాయకులు హోంమంత్రి అనితను కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నాయకులు మంగళవారం హోంమంత్రిని కలిశారు. వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా చాలా మంది ఖైదీలు సత్ప్ర వర్తనతో శిక్ష అనుభవిస్తున్నారన్నారు.
హోంమంత్రికి సీపీఐ నాయకుల వినతి
అనంతపురం విద్య, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఏళ్ల తరబడి జైలుశిక్ష అను భవిస్తున్న ఖైదీలను రిప బ్లిక్ డే సందర్భంగా విడు దల చేయాలని సీపీఐ నాయకులు హోంమంత్రి అనితను కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నాయకులు మంగళవారం హోంమంత్రిని కలిశారు. వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా చాలా మంది ఖైదీలు సత్ప్ర వర్తనతో శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వారికి క్షమాభిక్ష కోసం వారి కుటుంబి కులు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు 1995 నుంచి 2019 వరకూ అనేక జీవోలు విడుదల చేసి చాలా మంది ఖైదీలకు క్షమాభిక్ష వచ్చేలా చేశారని తెలిపారు. 2025 జనవరి 26న ఖైదీలకు క్షమాభిక్ష వచ్చేలా చూడాలని మంత్రికి వినతిపత్రం అందించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....