SFI : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:13 AM
విద్యారంగ సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి... విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డి మాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో విద్యార్థులు బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నగరంలో భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
అనంతపురం కల్చరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగ సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి... విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డి మాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో విద్యార్థులు బుధవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు నగరంలో భిక్షాటన చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. అనంత రం కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకుని పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషనకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ ఇచ్చిన హామీ మేరకు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిల ను విడుదల చేయాల న్నారు. అలాగే విద్యార్థుల మిగిలిన సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో అసెంబ్లీ ఉద్యమాన్ని చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, ఓతూరు పరమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వైటిసి రమేష్, రజిత, బంగి శివ, జిల్లా ఉపాధ్యక్షులు వంశి, తరిమెల గిరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....