Share News

DEVOTIONAL : సాయినాథుడికి పుష్పాభిషేకం

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:05 AM

మార్గశిర శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో పుష్పాభిషేకాన్ని వై భవంగా నిర్వహించారు. బాబా మూలవిరాట్‌ను విశేషంగా అలంకంకరిం చి, వివిధ రకాల పూలతో అభిషేకించారు.

DEVOTIONAL : సాయినాథుడికి పుష్పాభిషేకం
Devotees offering flowers

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : మార్గశిర శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో పుష్పాభిషేకాన్ని వై భవంగా నిర్వహించారు. బాబా మూలవిరాట్‌ను విశేషంగా అలంకంకరిం చి, వివిధ రకాల పూలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు చేశారు. మహా మంగళహారతి నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వైకుంఠం జయచంద్ర చౌదరి, కార్యవర్గం రవీంద్ర నాథ్‌, నాగానందం, వెంకటే శ్వర్లు, శ్రీరాములు, కృష్ణ మూర్తి, భార్గవకృష్ణ, రాఘవేంద్ర గుప్త, భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 13 , 2024 | 12:05 AM