Share News

GRIEVANCE : జిల్లా గ్రీవెన్సకు తగ్గిన సందడి

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:10 AM

ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూభవనలో నిర్వహిం చిన జిల్లా స్థాయి గ్రీవెన్సడేకి బాధితుల సందడి తగ్గింది. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో మాత్రమే పిర్యాదుల స్వీకరణ కొనసాగేది. అయితే కలెక్టరు ఈ సారి అనంత రెవెన్యూ డివిజన కార్యాలయం (ఆర్డీఓ)లో డివిజన ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స ఏర్పాటు చేశారు.

GRIEVANCE : జిల్లా గ్రీవెన్సకు తగ్గిన సందడి
Joint collector Sivanarayanasharma who is receiving the complaints

జేసీకి 122మంది బాధితుల వినతులు

అనంతపురం టౌన, సెప్టెంబరు30 : ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూభవనలో నిర్వహిం చిన జిల్లా స్థాయి గ్రీవెన్సడేకి బాధితుల సందడి తగ్గింది. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో మాత్రమే పిర్యాదుల స్వీకరణ కొనసాగేది. అయితే కలెక్టరు ఈ సారి అనంత రెవెన్యూ డివిజన కార్యాలయం (ఆర్డీఓ)లో డివిజన ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స ఏర్పాటు చేశారు. ఈ వారం తొలిసారి కావడంతో కలెక్టరుతో పాటు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు ఆర్డీఓ కార్యాలయం లో నిర్వహించిన గ్రీవెన్సకు వెళ్లారు. రెవెన్యూభవనలో జాయింట్‌ కలెక్టరు శివనారాయణశర్మ, డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అయితే పెద్దగా బాధితులు హాజరుకాలేదు. కేవలం 122మంది జేసీ, డీఆర్‌ఓలకు అందజేసి వినతిపత్రాలు అందజేసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్సకు 500మందికి పైగానే వస్తుండడంతో సందడిగా కొనసాగేది. కానీ సోమవారం తక్కువమంది రావడంతో ప్రశాంతంగా ముగిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 01 , 2024 | 12:10 AM