RTC : ఆర్టీసీ జోనల్ చైర్మనకు వినతులు
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:25 AM
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నా యకులు సంస్థ జోనల్ చైర్మన పూల నాగ రాజును కలిసి సమస్యలు విన్నవించారు. అనంతపురానికి శనివారం వచ్చిన జోనల్ చైర్మనను ఆయన చాంబర్‌లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన జి ల్లా అధ్యక్షుడు సూరిబాబు, డిపో కార్యదర్శి రామాంజనే యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతపురం డీఎం కార్యాలయం శిథిలా వస్థకు చేరుకుందని, నూతన భవనం ఏర్పా టుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నా యకులు సంస్థ జోనల్ చైర్మన పూల నాగ రాజును కలిసి సమస్యలు విన్నవించారు. అనంతపురానికి శనివారం వచ్చిన జోనల్ చైర్మనను ఆయన చాంబర్‌లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన జి ల్లా అధ్యక్షుడు సూరిబాబు, డిపో కార్యదర్శి రామాంజనే యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతపురం డీఎం కార్యాలయం శిథిలా వస్థకు చేరుకుందని, నూతన భవనం ఏర్పా టుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన నాయకులు పాల్గొన్నారు. అదేవి ధంగా ఆర్టీసీ కార్మిక పరిషత ఆధ్వర్యంలో నాయకులు జోనల్ చైర్మన పూలనాగరాజును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరిం చారు. బస్సు టైర్ల డ్యామేజ్, అధిక కేఎంపీఎల్ వేధింపులు వంటి సమస్యలను పరిష్కరించా లని కోరారు. కార్యక్రమంలో కార్మిక పరిషత ప్రాంతీయ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు వెంకటేశులు, ప్రచార కార్యదర్శి పరమేశ్వర్, అనంతపురం డిపో అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి జయప్రకాష్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....