COLLECTOR : రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:25 AM
రోడ్డు ప్రమాదాల నివారణ కు సీరియస్‌గా ఆలోచించా లని ఇనచార్జ్ కలెక్టరు శివ నారాయణశర్మ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డుప్రమాదాల నివారణపై శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఇనచార్జ్ కలెక్టరు మాట్లాడుతూ గత మూడు నెలల్లోనే జిల్లాలో రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయన్నారు.
అనంతపురం టౌన, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ కు సీరియస్‌గా ఆలోచించా లని ఇనచార్జ్ కలెక్టరు శివ నారాయణశర్మ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డుప్రమాదాల నివారణపై శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఇనచార్జ్ కలెక్టరు మాట్లాడుతూ గత మూడు నెలల్లోనే జిల్లాలో రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయన్నారు. ఈప్రమాదాలలో పలువురు చనిపోవ డం బాధాకరమన్నారు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణ మూర్తి, డీటీసీ వీర్రాజు, డీపీఓ నాగరాజునాయుడు, పీఆర్‌ఎస్‌ఈ, జహీర్‌ఇస్లామ్, ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత, డీఎంహెచఓ డాక్టరు ఈబీ దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టరు వెంకటేశ్వరరావు, హైవే టెక్నికల్ మేనేజరు మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈ.ఈ జేపీరెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అధికారులను కలెక్టరు(ఎఫ్‌ఏసీ) శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికరంగం బలోపేతం అయినపుడే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చాలన్నారు. అనంతరం 2020-23కు సంబంధించి 27 పరిశ్రమలకు గాను రూ.239.45 లక్షలు సబ్సిడీ సొమ్ము మంజూరుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో పరిశ్రమలశాఖాధికారి శ్రీధర్, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ మురళీమనోహర్, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, విద్యుతశాఖ ఎస్‌ఈ సంపత కుమార్, ఎల్డీఎం నరసింహారావుతోపాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....