Share News

Vasamshetty Subhash : కార్మికుల భద్రతకు ప్రాధాన్యం

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:35 AM

కార్మికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో జిల్లా అధికార యంత్రాంగంతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు, వాటి నిర్వాహకులు, కార్మికుల వివరాలను తెలుసుకున్నారు. పరిశ్రమలు, కార్మికులు తమ ప్రభుత్వానికి రెండు కళ్లు అని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. కార్మికుల భద్రత పట్ల యాజమాన్యాలు బాధ్యతగా ...

Vasamshetty Subhash : కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
Labor Minister Vasamshetty Subhash speaking at a meeting of officials

ఈఎ్‌సఐ ఆస్పత్రి ఏర్పాటును పరిశీలిస్తాం

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌

అనంతపురం టౌన, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): కార్మికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో జిల్లా అధికార యంత్రాంగంతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు, వాటి నిర్వాహకులు, కార్మికుల వివరాలను తెలుసుకున్నారు. పరిశ్రమలు, కార్మికులు తమ ప్రభుత్వానికి రెండు కళ్లు అని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు. కార్మికుల భద్రత పట్ల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గడిచిన మూడేళ్లలో ప్రమాదం జరగని పరిశ్రలు


ఉంటే.. వారు తీసుకుంటున్న భద్రతా చర్యలు గురించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సకు సీఎం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని అన్నారు. అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ప్రేమ ఉందని అన్నారు. కియ పరిశ్రమను జిల్లాకు తీసుకురావడం గర్వకారణమని అన్నారు. తమ శాఖ ద్వారా పరిశ్రమల యాజమాన్యాలకు ఎంత చేయగలమో అంతకన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే కార్మికులకు చట్టాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు అందించాలని సూచించారు. కర్మాగారాలలో ప్రమాదాల నివారణకు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వసుధా మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు.

ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని అన్నారు. జిల్లాలో ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. నైపుణ్య శిక్షణ ఇచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రమాదాల నివారణకు కలెక్టరు నేత్వత్వంలో జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాద బాధితులకు ఈ కమిటీ అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని అన్నారు. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ శివనారాయణ శర్మ, ఇనచార్జి డీఆర్వో తిప్పేనాయక్‌, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇనస్పెక్టర్‌ కేశవులు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 06 , 2024 | 12:35 AM