Home » Andhra Pradesh Ministers
రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రారంభమైంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా సంస్థల ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.85 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలిరానున్నాయి.
2014 విభజన తరువాత కూడా రాష్ట్రం ఇంత సంక్షోభంలో లేదని.. పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో..
మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు.. శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యత లు అప్పగించారు. ఇదే సమయంలో పాతతరానికీ ప్రాధాన్యం కొనసాగించా రు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం
సంపద సృష్టి పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేస్తామని, సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువస్తామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...
పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు.