MLC LAXMANRAO : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:23 AM
సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ కాంప్లెక్స్ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు.
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 15 : సమగ్రశిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ కాంప్లెక్స్ రీ ఆర్గనైజేషన వ్యవహారంలో ప్ర భుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు. సీఆర్‌పీ లు ఎవరూ ఆందోళన చెందవద్దని, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అండగా ఉంటార న్నారు. అగ్రిమెంట్ బాండ్ విధానం రద్దుకోసం ఉద్యోగులు ఐక్యంగా పోరా డాలన్నారు. చిరుద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హెచఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యో గుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంతారావు, సభ్యులు రామన్న, నాగరాజు, జిల్లా నాయకులు సురేష్‌వర్మ, నాగరాజు, మాధవ్, శంకరయ్య, నరసింహమూర్తి, నూర్‌మహ్మద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....