Share News

Sand : ఇసుక రచ్చ

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:15 AM

ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాకు రూరల్‌ సీఐ లక్ష్మీకాంతరెడ్డి సహకరిస్తున్నారని, వాహనాలను పట్టించినా కేసులు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులతో కలిసి రూరల్‌ పోలీ్‌సస్టేషన ఎదుట ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తన అనుచరుల బృందాన్ని ఏర్పాటు ...

Sand : ఇసుక రచ్చ
Agitation at Rural PS

అక్రమ రవాణాను అడ్డుకున్న అశ్మిత టీం

తీవ్ర వాగ్వాదం.. టిప్పర్‌ యజమానుల దాడి

ఎమ్మెల్యే చెప్పినా కేసు నమోదు చేయని సీఐ

రూరల్‌ పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే

సీఐ క్షమాపణలు చెప్పడంతో సద్దుమణిగిన వివాదం

తాడిపత్రి, ఆగస్టు 27: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాకు రూరల్‌ సీఐ లక్ష్మీకాంతరెడ్డి సహకరిస్తున్నారని, వాహనాలను పట్టించినా కేసులు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులతో కలిసి రూరల్‌ పోలీ్‌సస్టేషన ఎదుట ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తన అనుచరుల బృందాన్ని ఏర్పాటు చేశారు. తాడిపత్రి మండలం ఆలూరు, సజ్జలదిన్నె, వీరాపురం సమీపంలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా.. ఎమ్మెల్యే నియమించిన బృందం అడ్డుకుంది. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు బృందానికి టిప్పర్‌ యజమానులు, ఇసుక తరలింపుదారులకు మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. ఇసుక


తరలింపుదారుల దాడిలో ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లను స్టేషనకు తరలించారు. ఈ గొడవ గురించి ఎమ్మెల్యే అశ్మిత రెడ్డి మంగళవారం ఉదయం ఆయన అనుచరులు తెలియజేశారు. ఇసుక టిప్పర్లను సీజ్‌ చేయకుండా సీఐ లక్ష్మీకాంతరెడ్డి వదిలిపెట్టారని, తమపై దాడి జరిగినా కేసు నమోదు చేయలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో సీఐకి ఎమ్మెల్యే ఫోన చేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని సూచించారు. కానీ సీఐ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, మధ్యలోనే ఫోన కట్‌ చేశారని ఆగ్రహించిన ఎమ్మెల్యే.. నేరుగా రూరల్‌ పోలీస్‌ స్టేషన వద్దకు వెళ్లి ధర్నాకు దిగారు. ‘వైసీపీ సీఐ లక్ష్మికాంతరెడ్డి డౌన డౌన’ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీఐని సస్పెండ్‌ చేయాలని, లేదంటే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జనార్దననాయుడు, పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్‌ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వినకపోవడంతో ఎస్పీ జగదీ్‌షకు ఫోన చేసి మాట్లాడించారు. ఎమ్మెల్యే పట్టు వీడకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు సీఐ ఫోన చేసి మాట్లాడారు. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ఎమ్మెల్యేకి సీఐ వీడియో కాల్‌ చేసి క్షమాపణ చెప్పడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. సుమారు నాలుగు గంటలపాటు ఆందోళన కొసాగింది. వర్షం కురిసినా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కదల్లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీ్‌సస్టేషన వద్ద ధర్నా జరుగుతున్న సమయంలోనే యల్లనూరు రోడ్డులోని ద్వారకా విల్లా్‌సలో సీఐ లక్ష్మికాంతరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ శ్రేణులు వెళ్లాయి. విల్లాస్‌ వద్ద సెక్యూరిటీ అడ్డుకోవడంతో అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆందోళనలో టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, చింబిలి వెంకటరమణ, వేలూరు రంగయ్య, జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు సరస్వతి, అబ్దుల్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపైకి వస్తాం: అశ్మిత

ఇసుక అక్రమ తరలింపునకు పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే రోడ్లపైకి వస్తామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇసుక అక్రమ రవాణాపై యుద్ధం చేశామని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని అన్నారు. ఇసుక విషయంలో అక్రమాలు జరిగితే ఉపేక్షించనని హెచ్చరించారు. సజ్జలదిన్నె, ఆలూరు, వీరాపురం గ్రామాల సరిహద్దులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసి.. తాను ఏర్పాటుచేసిన బృందం అక్కడికి వెళ్లిందని అన్నారు. ఆ సమయంలో వారిపై దాడిచేసి గాయపరిచారని, ఈ విషయాన్ని తానే స్వయంగా రూరల్‌ సీఐ లక్ష్మికాంతరెడ్డికి ఫోన చేసి తెలియజేశానని అన్నారు. దాడి చేసింది ఎవరైనా సరే కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించానని అన్నారు. కానీ సీఐ తనతో పరుషంగా మాట్లాడారని, ఇసుకాసురులపై కేసు నమోదు చేయడానికి సీఐకి ఎందుకు మనసు రావడం లేదో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఎమ్మెల్యే అయిన తననే సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకే రూరల్‌ పోలీ్‌సస్టేషన వద్ద ధర్నా చేయాల్సి వచ్చిందని అన్నారు. అక్రమ ఇసుక రవాణాకు తాము వ్యతిరేకమని తమ వారైనా సరే వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇలాంటి పనులు మానుకోవాలని కోరారు.

Updated Date - Aug 28 , 2024 | 12:15 AM