CHRISTMAS : సెమీ క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:48 AM
స్థానిక అర్బన బ్యాంకులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయభవన అర్బనబ్యాంకులో మంగళవారం సెమీ క్రిస్మస్ వే డుకల్లో భాగంగా పాస్టర్ సురేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చైర్మన జేఎల్ మురళీధర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రజలకు చీకటి నుంచి వెలుగుపంచడమే తన జీవితపరమార్థమని యేసు పేర్కొన్నట్లు వివరించా రు.
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక అర్బన బ్యాంకులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయభవన అర్బనబ్యాంకులో మంగళవారం సెమీ క్రిస్మస్ వే డుకల్లో భాగంగా పాస్టర్ సురేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చైర్మన జేఎల్ మురళీధర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రజలకు చీకటి నుంచి వెలుగుపంచడమే తన జీవితపరమార్థమని యేసు పేర్కొన్నట్లు వివరించా రు. అనంతరం క్రిస్మస్ ట్రీ, స్టార్ వెలిగించి క్రిస్మస్ తాతా ప్రదర్శనలతో చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్యాంకు సీఈఓ విజయభాస్కర్, వైస్‌చైర్మన గోల్డ్‌భాషా, డైరెక్టర్లు సుంకర రమేష్, రామాంజినేయులు, రొళ్ల భాస్కర్, చింతా భాస్కర్, రమణయ్య, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల్లో క్రిస్మస్ కోలాహలం
అనంతపురం విద్య, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి) : నగరంలోని పలు స్కూళ్ల్లలో మంగళవారం క్రిస్‌మస్ వేడుకలను నిర్వహించారు. చిన్నారులు శాంతాక్లాజ్, జీసస్ వేషధారణల్లో హాజరై సందడి చేశారు. క్రీస్తు జననంపై స్కూళ్లలో నాటికలు ప్రదర్శించారు. రాంనగర్‌లోని బచపన స్కూల్‌లో స్కూల్ చైర్మన షాలి దాదా గాంధీ ఆధ్వర్యంలో, కోర్టు రోడ్డు శ్రీచైతన్య స్కూల్‌లో ఏజీఎం సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ తబస్సుమ్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. గుత్తిరోడ్డు, సంగమేష్ సర్కిల్‌లోని మాంటిస్సోరి విద్యాసంస్థల్లో, మినర్వా స్కూల్‌లో కరస్పాండెంట్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్‌మస్ వేడుకలను చిన్నారుల నడుమ ఘనంగా నిర్వహించారు.
అనంతపురం రూరల్: మండలంలోని కొడిమి గ్రామ సమీపంలోని ఎరా ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులు యేసు జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించారు. యేసు ప్రార్థనలు, నృత్యాలతో అలరించారు. పాఠశాల చై ర్మన అరుణ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తదతరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....