Harassment : బడిలో లైంగిక వేధింపులు..?
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:32 AM
నగరంలోని కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటికొచ్చిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులను ఓ స్కూల్ అసిస్టెంట్ కొంత కాలంగా వేధిస్తున్నాడని అందులో ఆరోపించారు. తమను తాకుతున్నాడని, గిల్లుతున్నాడని కొంద రు బాలికలు మాట్లాడిన ఆడియో బయటకు రావడానికి పాఠశాల ఉపాధ్యాయులలో అంతర్గత పోరు కారణమని...
ఓ టీచర్ తాకుతున్నారని ఆరోపణలు
ఉపాధ్యాయిని ఉద్దేశపూర్వకంగా చేయించారా..?
కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో టీచర్ల విభేదాలతో రచ్చ
హెచఎం, టీచర్లను పిలిచి
విచారిస్తాం: డీఈఓ
అనంతపురం విద్య, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): నగరంలోని కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటికొచ్చిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులను ఓ స్కూల్ అసిస్టెంట్ కొంత కాలంగా వేధిస్తున్నాడని అందులో ఆరోపించారు. తమను తాకుతున్నాడని, గిల్లుతున్నాడని కొంద రు బాలికలు మాట్లాడిన ఆడియో బయటకు రావడానికి పాఠశాల ఉపాధ్యాయులలో అంతర్గత పోరు కారణమని సమాచారం. కంప్యూటర్ ల్యాబ్‌లో ఎనఎంఎంఎ్‌స క్లాసులకు వెళ్లినప్పుడు ఓ స్కూల్ అసిస్టెంట్ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని బాధిత బాలికలు ఆరోపించారు. సుమారు 10 నుంచి 12 మంది విద్యార్థినులు మాట్లాడి.. రికార్డు
చేశారు. ఈ వ్యవహారంపై వారం క్రితమే స్కూల్‌లో రాజీ జరిగిందని అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి నుంచి సంజాయిషీ లెటర్ రాయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజమా..? నిందా..?
బాలికల ఆడియో బయటకు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పాఠశాలలో ఓ ఉపాధ్యాయని(స్కూల్ అసిస్టెంట్) ఉద్దేశపూర్వకంగా విద్యార్థినులతో ఇలా చెప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఫిజికల్ సైన్స స్కూల్ అసిస్టెంట్‌ను దెబ్బకొట్టడానికే ఆమె విద్యార్థినులను వాడుకుని, వారి వాయిస్ రికార్డును వైరల్ చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధ్యాయుల మధ్య కోల్డ్ వార్ ఎలా ఉన్నా, బాలికలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడం దుమారం రేపుతోంది. తమ పాఠశాలలో అలాంటిదేమీ జరగలేదని హెచఎం నారాయణ వివరణ ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిజకల్ సైన్స స్కూల్ అసిస్టెంట్‌ను విచారించామని తెలిపారు. ఆయన వివరణ కూడా తీసుకున్నానని అన్నారు. ఓ ఉపాధ్యాయని తరగతులకు వెళ్లకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని, విద్యార్థినులతో బలవంతంగా అలా చెప్పించారని అన్నారు.
విచారణ జరిగితేనే..
జిల్లా కేంద్రంలో, ఏకంగా 1500 మంది బాలికలు చదువుకునే చోట ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. నగరంలోని పలు సంక్షేమ వసతి గృహాలలో ఉంటున్న బాలికలు కేఎ్‌సఆర్ హైస్కూల్‌లో చదువుకుంటున్నారు. పాఠశాలలో 70 నుంచి 80 శాతం మంది విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నవారే. బాలికల భద్రత దృష్ట్యా లైంగిక వేధింపుల ఆరోపణలు, టీచర్ల మధ్య విభేదాల గురించి ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉంది. లైగింక వేధింపులు నిజమేనా..? లేక ఉద్దేశపూర్వకంగా బాలికలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారా..? నిగ్గుతేల్చి.. కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలలో జరుగుతున్న ఈ వ్యవహారాలు ఏవీ తన దృష్టికి రాలేదని డీవైఈఓ శ్రీనివాసులు అన్నారు. స్కూల్‌లో గొడవ అంటూ డీఈఓ నుంచి సమాచారం రావడంతో మంగళవారం వెళ్లి విచారించానని తెలిపారు. కానీ లైంగిక వేధింపుల గురించి తన దృష్టికి రాలేదని అన్నారు. లైంగిక వేధింపుల గురించి తన దృష్టికి రాలేదని డీఈఓ ప్రసాద్ బాబు అన్నారు. హెచఎం, స్కూల్ అసిస్టెంట్లను బుధవారం పిలిపించి, విచారిస్తానని తెలిపారు. బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....