GOD : ఘనంగా శ్రావణమాస పూజలు
ABN , Publish Date - Sep 01 , 2024 | 12:34 AM
పట్టణంలోని శివానగర్‌లోవెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శ్రావణ మాస చివరి శనివారం పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు అభిషేకాలు చేశారు. పూలు, తులసి తమలపాకులు, వడమాలతో అలంకరించారు.
ధర్మవరం, ఆగస్టు 31: పట్టణంలోని శివానగర్‌లోవెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శ్రావణ మాస చివరి శనివారం పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌కు అభిషేకాలు చేశారు. పూలు, తులసి తమలపాకులు, వడమాలతో అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామికి పూజలు చేయించారు.
గాండ్లపెంట: మండలంలోని బొలుగుట్టపల్లి, వేపరాల కురమామిడి, పాయక ట్టు, మునగలవారిపల్లి, గాండ్లపెంట ఆలయాల్లో వెలసిన ఆంజనేయస్వామిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మునగలవారిపల్లి గరుడాంజనే యస్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించారు.
బుక్కపట్నం: మండలంలోని అగ్రహారం గ్రామంలో కొండల్లో వెలసిన అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి మడుగు భజన కార్యక్రమాన్ని గ్రామస్థు లు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా శ్రా వణమాసం నాలుగో శనివారం ఈ కార్యక్రమాన్ని ని ర్వహించడం ఆనవాయితీ. గ్రామానికి చెందిన యువకులు నవీనకుమార్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....