Share News

APTF: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:37 AM

ఉపాధ్యా యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌనిపాతిరెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు మోహనరెడ్డి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు నరేష్‌, ఇతర నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్‌లో కలిశారు.

APTF:  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి
APTF leaders who met the DEO

డీఈఓకు ఏపీటీఎఫ్‌ నాయకుల వినతి

అనంతపురం విద్య, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యా యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌనిపాతిరెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు మోహనరెడ్డి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు నరేష్‌, ఇతర నాయకులు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో అపార్‌ ఐడీ జనరేట్‌ కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని ఉపా ధ్యాయ సంఘాలతో తరచూ కో- ఆర్డినేషన మీటింగ్‌ నిర్వహించి, టీచర్ల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కా వాలని కోరారు. ఆ సంఘం నాయకులు గురురాజు, సాంబశివారెడ్డి, సూర్యనారాయణ, లక్ష్మన్న, ఎల్లప్ప, ఈశ్వరయ్య, ప్రభాకర్‌, మదన తదితరులు పాల్గొన్నారు.

ఫకనగానపల్లి: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌ కుమార్‌, కౌన్సి లర్‌ బీకే ముత్యాలప్ప, డిమాండ్‌ చేశారు. మామిళ్లపల్లి జడ్పీ పాఠశాలలో బుధవారం సభ్యత్వ నమోదు చేపట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 14 , 2024 | 12:37 AM