Share News

TDP : సభ్యత్వాలపై అధిష్టానం నిశిత పరిశీలన

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:19 AM

టీడీపీ సభ్యత్వాల నమో దు అంశాన్ని పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం టీడీపీ అర్బన కార్యాలయంలో నియోజకవర్గం పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి పలువురు టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.

TDP : సభ్యత్వాలపై అధిష్టానం నిశిత పరిశీలన
MLA Daggupati Prasad met with the chief leaders

పార్టీ ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వాల నమో దు అంశాన్ని పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం టీడీపీ అర్బన కార్యాలయంలో నియోజకవర్గం పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి పలువురు టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. అర్బన పరిధిలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వాలపై ఆరా తీశారు. సభ్యత్వాల నమోదులో ముందున్న నాయకులను అభినందించారు. పార్టీ అధిష్టానం మనపై నమ్మకంతో ఈ బాధ్యత పెట్టిందన్నారు. కావున మనం మరింత కష్టపడి పనిచేయాల్సిందిపోయి కొందరు నాయకులు సభ్యత్వాల నమోదు లో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. పార్టీ అధిష్టానం అన్నీ పరిశీలిస్తోందని, ఇప్పటి నుంచైనా లక్ష్యం మేరకు నమోదు చేయించేలా ప్రత్యేక చొరవ చూ పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయల్‌ మురళి, గోపాల్‌ గౌడ్‌, సుధాకర్‌ యాదవ్‌, కూచి హరి, రాజారావు, వన్నూరప్ప, దళవాయి వెంకట నారాయణ, గుర్రం నాగభూషణం, సైఫుద్దీన, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎల్‌ఎన మూర్తి, తమ్మినేని వేణు, వడ్డే భవాని తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 26 , 2024 | 12:19 AM