SONGS : అలరించిన గాన స్వరాంజలి
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:57 AM
సినీ గాయకుడు మహమ్మద్ రఫి జయంతిని పురస్కరించుకుని సాదియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గాన స్వరాంజలి వీక్షకులను ఎంతగానో అలరించింది. స్థానిక లలిత కళా పరిషత ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్ర మాన్ని పరిషత ప్రధాన కార్యదర్శి పద్మజ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతపురం కల్చరల్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సినీ గాయకుడు మహమ్మద్ రఫి జయంతిని పురస్కరించుకుని సాదియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గాన స్వరాంజలి వీక్షకులను ఎంతగానో అలరించింది. స్థానిక లలిత కళా పరిషత ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్ర మాన్ని పరిషత ప్రధాన కార్యదర్శి పద్మజ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తొలుత కళాకారులతో కలిసి మహమ్మద్ రఫి చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన గాన స్వరాంజలిలో స్థానిక కళాకారు లతో పాటు కర్ణాటకకు చెందిన నిర్మలనీలి, మౌలా హుస్సేన, మధ్యప్రదేశకు చెందిన రియా, ఫారూక్, రామాంజి మహమ్మద్ రఫి పాటలు ఆలపించారు. ఎస్కేయూ విశ్రాంత రిజిస్ర్టార్ ఆచార్య సుధాకర్‌బాబు, పైలా నరసింహులు, సా లార్‌బాషా, సాదియా సంస్థల అధినేతలు డిస్కోబాబు, షబానా, ర్యాంబో అస్లాం బాషా, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....