Share News

JC : పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:16 AM

విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ సూచించారు. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాలను మంగళవారం ఘంగా నిర్వహించారు.

JC : పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
Jaycee delivering three wheelers

దివ్యాంగుల దినోత్సవంలో జేసీ శివ్‌నారాయణ్‌ శర్మ

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి) : విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ సూచించారు. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాలను మంగళవారం ఘంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక పథకాలను అమలుజేస్తు న్నట్లు తెలిపారు. అర్హులైన వారికి తగిన పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మతో కలిసి మూడు చక్రాల సైకిళ్లను పంపిణీచేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ డీడీ కుష్బూకొఠారి, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, సూరింటెండెంట్‌ వెంకటరమణ, విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 12:16 AM