Share News

CENTRAL PARK: తేలని సెంట్రల్‌పార్కు పంచాయితీ

ABN , Publish Date - Dec 04 , 2024 | 11:45 PM

నగరంలోని సెంట్రల్‌ పార్కు పంచాయతీ ఇప్పట్లో తేలేలా లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తూనే ఉం ది. ఎన్ని సార్లు సర్వే చేసినా అందులో ఆక్రమణ ఎంత..? నగరపాలిక స్థలమెంత..?అనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. గత కొన్ని రోజులుగా సెంట్రల్‌ పార్కులో రోడ్డు ఏర్పాటు చేయటానికి అధికారులు ప్రయ త్నిస్తున్నారు.

CENTRAL PARK:  తేలని సెంట్రల్‌పార్కు పంచాయితీ
Krishnamurthy showing the documents to the surveyor

రోడ్ల కోసం సర్వే చేపట్టిన అధికారులు

కోర్టులో ఉందంటూ అడ్డుకున్న

వైసీపీ నాయకుడు క్రిష్ణమూర్తి

అనంతపురం క్రైం,డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని సెంట్రల్‌ పార్కు పంచాయతీ ఇప్పట్లో తేలేలా లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తూనే ఉం ది. ఎన్ని సార్లు సర్వే చేసినా అందులో ఆక్రమణ ఎంత..? నగరపాలిక స్థలమెంత..?అనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. గత కొన్ని రోజులుగా సెంట్రల్‌ పార్కులో రోడ్డు ఏర్పాటు చేయటానికి అధికారులు ప్రయ త్నిస్తున్నారు. అయితే స్పష్టత రావడం లేదు. బుధవారం సర్వే చేయడానికి అధికారులు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నాయకుడు క్రిష్ణమూర్తి అక్కడికి వచ్చారు. సర్వే నెంబరు 154లో ప్రధానంగా 154/5లో సమస్య ఉంద న్నారు. కోర్టు పరిధిలో కొన్ని భూములున్నాయన్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ప్రశ్నిం చారు. ఇందుకు సర్వేయర్‌ రఘు రోడ్లు నిర్మించడం ద్వారా అక్రమణలు ఎక్కడున్నాయనేది తెలుస్తుందని, అందులో భాగంగా సర్వే చేస్తున్నామన్నారు. మరెందుకు నోటీసులి వ్వలేదని క్రిష్ణమూర్తి ప్రశ్నించారు. అనంతరం అధికారులు, సర్వే సిబ్బంది వెనుదిరిగారు. కాగా కొందరు ఎన్ని సార్లు సర్వే అడ్డుకుంటారని ప్రశ్నించారు. మరికొందరు తాము మరోసారి కోర్టుకెళ్తామని చెప్పుకొచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 11:51 PM