MLA SUNITA : రైతులకు నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:12 AM
రైతులకు నాణ్యమైన విద్యుతను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీ త పేర్కొన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత విద్యు త శాఖాధికారులపై ఉందన్నారు. చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలలా రైతు లకు మంజూరైన వ్యవసాయ ట్రాన్సఫార్మర్మలను పంపిణీ చేశారు.
చెన్నేకొత్తపల్లి/రామగిరి, అక్టోబరు 6: రైతులకు నాణ్యమైన విద్యుతను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీ త పేర్కొన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత విద్యు త శాఖాధికారులపై ఉందన్నారు. చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలలా రైతు లకు మంజూరైన వ్యవసాయ ట్రాన్సఫార్మర్మలను పంపిణీ చేశారు. మం డలంలోని ఎనఎస్‌గేటు సబ్‌స్టేషన ఆవరణంలో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన రైతులకు 33 ట్రాన్సఫార్మర్లను ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చే శారు. మండలానికి సంబంధించి 33 ట్రాన్సపార్మర్లను అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స పార్మర్ల కోసం రైతులు ఏళ్ల తరబడి విద్యుత కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.
అప్పట్లో కేవలం వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే ట్రాన్స ఫార్మర్లు వచ్చేవని, టీడీపీ అధికారంలోకివచ్చిన తరువాత పార్టీలకతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతిరైతుకు ట్రాన్సఫార్మర్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అలాగే అధికారు లు రైతుల సమస్యల నిర్లక్ష్యం వ హించకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. ట్రాన్సకో డీఈ శివరాం, ఏడీఈ లక్ష్మీనారాయణ, సీకేపల్లి,రామగిరి ఏఈలు రామాంజినేయులు, వెంకటేశులు, టీడీపీ కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, మాడెం సూర్యనారాయణరెడ్డి, గేటు కిష్టప్ప, నాగరాజు, ఆంజనేయులు, హరి నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగిరి మండల కేంద్రంలోని సబ్‌స్టేషనలో ఆ మండలానికి చెందిన రైతులకు ట్రాన్సఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....