Share News

MP, MLA : పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:13 AM

జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చ బోతోం దని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు.

MP, MLA : పల్లెల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
MP and MLA who unveiled the Sisroad plaque

ఎంపీ అంబికా, ఎమ్మెల్యే శ్రావణి శ్రీ

గార్లదిన్నె, అక్టోబర్‌ 16(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చ బోతోం దని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు. ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ముఖ్య అథితులుగా హాజ రయ్యా రు. ఈ సందర్భంగా కొత్తూరు సమీపంలో ఉపాధి పథకం ద్వారా రూ. 49.50 లక్షల నిధులతో సుమారు కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.... దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గాంఽధీజీ చెప్పిన విధంగా గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్య మంత్రి చంద్రబాబు పల్లెపండుగ వారోత్సవాల భాగంగా సీసీరోడ్లు, డ్రైనేజీలు, విద్యుత సదుపాయం కల్పిస్తున్నారన్నారు


. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ విశాలాక్షి, సర్పంచు రాధికమ్మ, తహసీల్దార్‌ బండారు ఈరమ్మ, ఎంపీడీఓ యోగానందరెడ్డి, పీఆర్‌ఏఈ శ్రీనివాస్‌రావు, ఈఓఆర్డీ దామోదరమ్మ, ఆర్‌డూబ్ల్యుఎస్‌ ఏఈ లక్ష్మణ్‌, గేటుక్రిష్ణారెడ్డి, పాండు, గుత్తాబాలకృష్ణ, సుంకన్న, ఎంపీటీసీ సురేంద్రనాథ్‌రెడ్డి, జయరాం, బాబయ్య, చల్లానాగరాజు, వడ్లరాము, శ్రీనాథ్‌, శ్రీరాములు, గుత్తాహరి, చింతావెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 17 , 2024 | 12:14 AM