Share News

PROTEST : ఎంపీడీఓపై దాడి దుర్మార్గం

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:05 AM

అన్నమయ్య జిల్లాలో డ్యూటీలలో ఉన్న గాలివీడు ఎంపీడీ ఓ జవహర్‌బాబుపై వైసీపీ నేత దాడి చేయడం దుర్మార్గ మని ఎంపీడీఓలు, మిని స్టీరియల్‌ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర పంచాయతీరాజ్‌ సిబ్బంది ఖం డించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద శనివారం ఎంపీడీఓలు, ఇతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

PROTEST : ఎంపీడీఓపై దాడి దుర్మార్గం
Employees protesting at Anantapur MPDO office

జిల్లా వ్యాప్తంగా ఎంపీడీఓ

కార్యాలయాల వద్ద నిరసన

అనంతపురం విద్య, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య జిల్లాలో డ్యూటీలలో ఉన్న గాలివీడు ఎంపీడీ ఓ జవహర్‌బాబుపై వైసీపీ నేత దాడి చేయడం దుర్మార్గ మని ఎంపీడీఓలు, మిని స్టీరియల్‌ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర పంచాయతీరాజ్‌ సిబ్బంది ఖం డించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద శనివారం ఎంపీడీఓలు, ఇతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతపురం, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, బెళుగుప్ప, పెద్దపప్పూరు ఇలా అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు. ఎంపీడీఓలు దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు. చికిత్స పొందుతున్న బాధిత ఎంపీడీఓ జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ కడప రిమ్స్‌ ఆసుపత్రిలో పరా మర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఇది యావత పంచాయతీరాజ్‌ సిబ్బంది లో ధైర్యం పెంచేలా చేసిందన్నారు.

దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య డిమాండ్‌

అనంతపురం న్యూటౌన, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గాలివీడు ఎంపీడీఓ జవహర్‌ బాబుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయంపై దాడికి వెళ్లి, తాళాలు వేసి, అధికారులపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 29 , 2024 | 01:05 AM