Share News

LIQUOR POLICY : నూతన మద్యం పాలసీని రద్దు చేసుకోవాలి

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:41 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీని... మహిళలు, ప్రజల మానప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఉపసంహ రించుకోవాలని మహిళా సంఘాల జేఏసీ నాయకురాలు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి డిమాం డ్‌ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం క్లాక్‌టవర్‌ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

LIQUOR POLICY : నూతన మద్యం పాలసీని రద్దు చేసుకోవాలి
United Nations leaders submitting a petition to Gandhi's statue

ఫఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 2 : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీని... మహిళలు, ప్రజల మానప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఉపసంహ రించుకోవాలని మహిళా సంఘాల జేఏసీ నాయకురాలు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి డిమాం డ్‌ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం క్లాక్‌టవర్‌ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ... ఓ వ్యక్తి తాగుడుకు బానిసైతే అతడి ఇల్లు, ఒల్లు గుల్ల కావడమేకాకుండా, అతడి కుటుంబంలో భార్యా బిడ్డలు హింసకు కారణమవుతున్న మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకురాళ్లు పద్మ, పార్వతి, సరస్వతి, అనిత, చంద్రిక, రామాంజినమ్మ, శంషాద్‌, నారాయణమ్మ, అరుణ, లక్ష్మి, ఆవాజ్‌ నాయకులు వలి, ఇర్ఫాన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 03 , 2024 | 12:41 AM