Share News

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:48 PM

రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

AIYF : నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి
A view of unveiling the stupa of AIF

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు

అనంతపురం కల్చరల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తపోవనం నుంచి నవయుగ కాలనీ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నవయుగ కాలనీలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్‌ స్తూపాన్ని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనినబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ఆవిష్కరించారు. లెనినబాబు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయ న్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్య వ్యాపారంగా మారిందని, వైద్యం అందరికీ అందడం లేదని, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆరోపించారు.


ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా అది నెరవేర్చలేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ మాట్లాడుతూ ప్రతియేటా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి ప్రతిఒక్కరి ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పి ప్రధాని మోదీ దేశప్రజలను మోసగించాడన్నారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ... రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నవయుగ కాలనీ కార్యదర్శి రాజు, ఏఐవైఎఫ్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్‌, మోహనకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 17 , 2024 | 11:48 PM