Share News

SP : హైవేపై బ్లాక్‌స్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ABN , Publish Date - Dec 04 , 2024 | 12:20 AM

నంతపురం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-44పై బ్లాక్‌ స్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్‌ ఎనహెచఏఐ, ఆర్టీఏ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్లాక్‌ స్పాట్ల ప్రాంతాలైన రాప్తాడు జంక్షన, అయ్య వారిపల్లి క్రాస్‌, తపోవనం కూడలి, శిల్పా రామం సమీపంలోని బ్రిడ్జి కూడళ్లలో ఎస్పీ పర్యటించారు.

SP : హైవేపై బ్లాక్‌స్పాట్లను పరిశీలించిన ఎస్పీ
SP Jagadish inspecting the Y junction in Raptadu

అనంతపురం క్రైం/ రాప్తాడు, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): అనంతపురం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-44పై బ్లాక్‌ స్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్‌ ఎనహెచఏఐ, ఆర్టీఏ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్లాక్‌ స్పాట్ల ప్రాంతాలైన రాప్తాడు జంక్షన, అయ్య వారిపల్లి క్రాస్‌, తపోవనం కూడలి, శిల్పా రామం సమీపంలోని బ్రిడ్జి కూడళ్లలో ఎస్పీ పర్యటించారు. జాతీయ రహదారిపై డ్రోన్లు ఆపరేట్‌ చేసి ప్రమాదాలకు కారణాలపై ఎస్పీ చూపించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రిం చాలంటే ఎలాంటి పరిష్కారాలు, ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అయ్య వారిపల్లి క్రాస్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చే యాలన్నారు. ఆ క్రాస్‌ నుంచి రాప్తాడు హైవే వరకు హైవేపై ఉన్న మీడియన్స క్లోజ్‌ చేసి వాటి స్థానంలో ఐరన బ్యాడికేడింగ్‌ చే యాల ని సూచించారు. సైన బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు, క్యాట్‌ ఐస్‌, లైటింగ్‌, రంబబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. డీటీసీ వీరరాజు, రూరల్‌ డీఎస్పీ వెంకటేశులు, సీఐలు వెంకటేష్‌ నాయక్‌, శ్రీహర్ష, శేఖర్‌, రఘుప్రసాద్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 04 , 2024 | 12:20 AM