VINAYAKA FESTIVAL : నాలుగోరోజు కొనసాగిన పూజలు
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:10 AM
పట్టణంలో వినాయక మండపాల వద్ద నాలుగోరోజు మంగళవారం పూజలు కొనసాగాయి. పలు మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఉదయం 10గంటలకు ప్రత్యేక పూ జల అనంతరం విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా మఽధ్యా హ్నానికి ప్రధాన రహదారి సీబీరోడ్డుకు తీసుకురానున్నారు.
నాలుగోరోజు కొనసాగిన పూజలు
తాడిపత్రి, సెప్టెంబరు 10: పట్టణంలో వినాయక మండపాల వద్ద నాలుగోరోజు మంగళవారం పూజలు కొనసాగాయి. పలు మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
నేడు నిమజ్జనం : వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఉదయం 10గంటలకు ప్రత్యేక పూ జల అనంతరం విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా మఽధ్యా హ్నానికి ప్రధాన రహదారి సీబీరోడ్డుకు తీసుకురానున్నారు.
దాదాపు 200 వినాయక విగ్రహాలు తరలిరానున్నాయి. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా డీఎస్పీ జనార్దననాయుడు ఆధ్వర్యంలో గుంతకల్లు డీఎస్పీతోపాటు సీఐలు సాయిప్రసాద్, శివగంగాధర్‌రెడ్డి, ఈరన్న, సుబ్రహ్మణ్యం, రామసుబ్బయ్య, పదిమంది ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, ఏఆర్ కానిస్టేబుళ్లు, స్పెషల్‌పార్టీ పోలీసులు దాదాపు 200మందితో భద్రతను ఏర్పాటుచేశారు. మండంలోని ఆలూరు, యర్రగుంటపల్లి, చీమలవాగుపల్లి, బొందలదిన్నె గ్రామాల శివారులో ఉన్న చెరువులు, వంకలు, వాగుల్లో వినాయక నిమజ్జనం జరగనుంది.
రూ.1.42లక్షలు పలికిన గణేష్ లడ్డు
తాడిపత్రి: పట్టణంలోని కేవీరెడ్డినగర్‌లో ఏర్పాటుచేసిన భారీ గణనాథుడి లడ్డూప్రసాదం రూ.1,42,100 గరిష్ట ధర పలికింది. అదే కాలనీకి చెందిన మనోజ్‌రెడ్డి, కీర్తిరెడ్డి వేలంలో దక్కించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....