Share News

Theft : కోటంక ఆలయంలో చోరీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 11:51 PM

కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...

Theft : కోటంక ఆలయంలో చోరీ
DSP Venkatasiva Reddy, CI Sridhar and temple EO Babu are investigating in the temple

తలుపులు బద్ధలుకొట్టి చొరబడిన దుండగులు..

గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆభరణాలు మాయం

గార్లదిన్నె, జూన 21: కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం చేసి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారి గర్భగుడి తలుపులను బద్దలుకొట్టారు. లోపల ఉన్న రెండు బీరువాలను, రెండు హూండీలను పగులగొట్టారు. స్వామివారి బంగారు కిరీటం, నాలుగు శఠగోపాలు, స్వామివారి పాదాలు, అమ్మవారి


మంగళసూత్రం, వెండి తీర్థంగిన్నె, అష్టలక్ష్మి చెంబు, అయ్యప్ప, వినాయకుడి వెండి గొడుగులు, తీర్థపు చెంబు, ఉత్సవ కిరీటం, స్వామివారి కల్యాణమూర్తి, నాగపడిగలు, వెండి దీపపు స్తంభం, అర్ధ కిరీటం.. ఇలా 19 రకాల బంగారు, వెండి అభరణాలను, రూ.5 వేల నగదును ఎత్తుకుపోయారు. ఆలయంలో ఉన్న సీసీ కెమరాలను ధ్వంసం చేసి, హార్డ్‌ డిస్క్‌లను ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రధాన ఆర్చకులు రామాచార్యులు శుక్రవారం ఉదయం వెళ్లి చూశాక చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు, ఆలయ ఈఓ బాబుకు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ శ్రీధర్‌ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్ల్యూస్‌ టీం ఆధారాలను సేకరించింది. దొంగలకోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ గౌస్‌బాషా తెలిపారు. కాగా, ఆలయంలో రూ.80 లక్షల విలువైన ఆభరణాల చోరీ జరిగినట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని, రూ.7 లక్షల విలువైన ఆభరణాలు మాత్రమే చోరీ అయ్యాయని ఈఓ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 11:51 PM