Share News

JAGANANNA HOUSES : దొరికినంత దోచేశారు..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:20 AM

జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట వైసీపీ హయాంలో భారీ దోపిడీ జరిగింది. అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన హౌసింగ్‌ అనకొండ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకున్న రాక్రీట్‌ సంస్థ ద్వారా వివిధ రూపాల్లో రూ.వందల కోట్లు కాజేశారు. జరిగిన పనికంటే ఎక్కువ బిల్లులు చేయడం, సిమెంటు, ఇసుక, స్టీల్‌ను స్టాక్‌ పాయింట్‌ నుంచి గుట్టుగా పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. సిమెంట్‌ రోడ్లకు, అమ్మ డెయిరీ, బ్రిక్స్‌ ప్లాట్‌ఫారం, సిమెంట్‌ గోడౌన నిర్మాణాలకు సైతం జగనన్న ఇళ్ల సామగ్రినే వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తోపు సమీప బంధువు, ...

JAGANANNA HOUSES : దొరికినంత దోచేశారు..!
Jagananna Houses built by Topu Sanstha though not sanctioned..

సిమెంట్‌, కంకర, ఇసుక, స్టీల్‌.. అన్నీ పక్కదారి

అమ్మ డెయిరీ, సీసీ రోడ్లకు అక్రమ వినియోగం

మంజూరు కాని ఇళ్లను నిర్మించి.. అనలైనలోకి..

ఓటమి తరువాత స్టీల్‌ను కాజేయాలని కుట్ర

హైసింగ్‌లో అనకొండ.. తోపుదుర్తి అక్రమాలు

అనంతపురం సిటీ, జూన 25: జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట వైసీపీ హయాంలో భారీ దోపిడీ జరిగింది. అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన హౌసింగ్‌ అనకొండ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకున్న రాక్రీట్‌ సంస్థ ద్వారా వివిధ రూపాల్లో రూ.వందల కోట్లు కాజేశారు. జరిగిన పనికంటే ఎక్కువ బిల్లులు చేయడం, సిమెంటు, ఇసుక, స్టీల్‌ను స్టాక్‌ పాయింట్‌ నుంచి గుట్టుగా పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. సిమెంట్‌ రోడ్లకు, అమ్మ డెయిరీ, బ్రిక్స్‌ ప్లాట్‌ఫారం, సిమెంట్‌ గోడౌన నిర్మాణాలకు సైతం జగనన్న ఇళ్ల సామగ్రినే వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తోపు సమీప బంధువు, వర్క్‌ ఇనస్పెక్టర్‌ నందకుమార్‌రెడ్డి, తోపు స్నేహిడైన రాక్రీట్‌ సూపర్‌వైజర్‌ అమర్నాథరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఈ లెక్కలను సరిచేసే బాధ్యతను అనకొండ తీసుకున్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రాక్రీట్‌ సంస్థ 50,385 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. కేవలం 1500 ఇళ్లను పూర్తి చేసింది. వీటికి ఏకంగా రూ.350 కోట్లు బిల్లులు చేసుకుంది. జిల్లాలోనూ ఇదే స్థాయి అక్రమాలు జరిగాయి.


మంజూరు కాకున్నా..

ప్రభుత్వం మంజూరు చేస్తేనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. కానీ నగర శివారులోని ఆలమూరు, కొడిమి జగనన్న లే అవుట్‌లో రాక్రీట్‌ సంస్థ తెరవెనుక రాజకీయం చేసింది. సుమారు రూ.2.50 కోట్లు ఖర్చు చేసి 320 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరోసారి తమదే అధికారం అన్న ధీమాతో అనకొండ సహకారంతో చకచకా పనులు చేయించేశారు. దాదాపు 60 శాతం పనులు పూర్తి చేశారు. కానీ టీడీపీ కూటమి విజయంతో ఆపనులను ఎక్కడిక్కడ ఆపేశారు. మంజూరు కాని ఇళ్లను నిర్మించినందుకు అయిన ఖర్చును లబ్ధిదారుల నుంచి ఎలా వసూలు చేయాలో తెలియక జుట్టు పీక్కున్నారు. చేసేదీ లేక.. అనకొండ ఇంజనీరు ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులను తారుమారు చేసి, ఆనలైనలో ఎక్కించారని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. రాప్తాడు నియోజకవర్గంలో సుమారు 120 పాత ఇళ్లకు బిల్లులు చేసిన.. అనకొండ భారీగా సొమ్ము చేసుకున్నారని సమాచారం.

రూ.వందల కోట్లు దోచారు

రాక్రీట్‌ సంస్థ చేసిన పనులకు.. పొందిన బిల్లులకు పొంతన లేదని గృహ నిర్మాణశాఖ వర్గాలు అంటున్నాయి. ఆ శాఖ అనకొండ సహకారంతో ఇసుక, సిమెంట్‌, కంకర, స్టీల్‌ రూపంలో భారీగా దోచేశారని అంటున్నారు. తోపు బినామీల పేరిట పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో చేసిన సిమెంట్‌ రోడ్ల పనుల్లోనూ భారీ ఆక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. కక్కలపల్లి, పాపంపేట, బండమీదపల్లి తదితర ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్లకు హౌసింగ్‌ సామగ్రిని వినియోగించి, అడ్డదారిలో బిల్లులు చేసుకున్నారని సమాచారం. ఇందుకు పీఆర్‌ అధికారులు కూడా సహకరించారని తెలిసింది. జేఎనటీయూ సమీపంలో జగనన్న లే అవుట్‌ కోసం సేకరించిన మూడు ఎకరాలను తోపుదుర్తి సోదరుల్లో


ఒకరు, ఎంపీపీ స్థాయి నాయకుడు కలిసి కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమిలో లే అవుట్‌ రోడ్లు వేయడానికి మట్టి తరలించి, ఎంపీడీఓ ద్వారా బిల్లులు చేయించారు. కానీ జగనన్న లే అవుట్‌ ఏర్పాటు చేయకుండా.. భూమిని కాజేశారు. ఈ వ్యవహారంలో అనకొండ పాత్ర కీలకమని తెలిసింది. అమ్మ డెయిరీ సమీపంలోని ఓ రైతుకు చెందిన ఐదు ఎకరాల భూమిని బెదరించి లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సుమారు రూ.500 కోట్ల దాకా దోచేశారని సమాచారం.

వెయ్యి టన్నుల ఐరన..

నిర్మాణ పనులకు అవసరమైన మేరకు స్టీల్‌ తెప్పించాల్సి ఉంటుంది. కానీ ఎన్నికలకు ఏడాది ముందు ఏకంగా రూ.ఆరు కోట్లు విలువ చేసే 1000 టన్నుల స్టీల్‌ను తెప్పించి కొడిమి జగనన్న లే అవుట్‌లో ఉంచారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే రాక్రీట్‌ సంస్థకు ఏలాంటి ఇబ్బంది ఉండకూడదన్నట్లు వ్యవహరించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆ స్టీల్‌ వానకు తడిసి, ఎండకు ఎండి తుప్పు పడుతోంది. ప్రజాధనం మట్టిపాలు అవుతోంది. ప్రభుత్వం మారడంతో ఆ స్టీల్‌ను మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనకొండ, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పథకం వేశారు. కానీ స్థానికులు అడ్డుకోవడంతో వారి పాచిక పారలేదు.


అక్రమార్కుల టీం వర్క్‌

తోపు ఆక్రమాల గురించి అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. జగనన్న కాలనీలను మింగేసినా, గృహ నిర్మాణ సామగ్రిని పక్కదారి పట్టించినా స్పందించలేదు. ఐదేళ్ల హౌసింగ్‌ దందాలో అనకొండతోపాటు ఇనచార్జి పీడీ, ఇద్దరు డీఈఈలు, ఇద్దరు ఏఈలు, ఓ ఎంపీడీఓ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు డీఈఈలో ఒకరు మాజీ సీఎం జగనకు సమీప బంధువు అని తెలిసింది. ప్రభుత్వం మారడంతో అవినీతికి పాల్పడిన అధికారులలో వణుకు మొదలైంది. వీరిలో పలువురు సెలవులో వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 26 , 2024 | 12:20 AM