Share News

MINISTER SAVITHA: అభివృద్ధి అంటే ఇదీ..

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:27 AM

వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు.

MINISTER SAVITHA: అభివృద్ధి అంటే ఇదీ..
Minister Savitha showing the new road in Shettipally

పెనుకొండ రూరల్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లపై గుంతలకు మట్టి కూడా వేయలేకపోయిందనీ, కూటమి ప్రభుత్వం నెలల వ్యవధిలోనే కొత్త రోడ్లు వేస్తోందనీ అభివృద్ధి అంటే ఇదీ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేతజౌళి శాఖ మంత్రి సవిత.. వైసీపీ నాయకులు చురకలు అంటించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని శెట్టిపల్లిలో ఉపాధిహామీ నిధులు రూ.30లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అక్కడే నిలబడి వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. ఐదేళ్ల పాలనలో కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు, కనీసం గుంతలకు మట్టికూడా వేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీదన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 120 రోజుల్లోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు మహర్దశ పట్టిందన్నారు. ఊరూరా రోడ్లు వేస్తున్నారన్నారు. ఏ పల్లెకెళ్లినా డ్రైనేజీ పనులు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. మండలంలోని రాంపురం పంచాయతీ మరువపల్లి, హనుమప్పల్లి, శెట్టిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమిపూజ చేశా రు. మంత్రికి ఊరూరా ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వెంకటరమణ, సర్పంచ శ్రీనివాసులు, మండల కన్వీనర్లు శ్రీరాములు, సిద్దయ్య, టీడీపీ నేతలు వెంకటేశ్వర్‌రావు, చిన్నవెంకటరాముడు, రఘువీరాచౌదరి, రామలింగ, గుట్టూరు సూరి, మాజీ ఎంపీటీసీ తిప్పన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:27 AM