VIGILIANCE : ప్రభుత్వ ఖజానాకు గండికొట్టాలని చూస్తే సహించం
ABN , Publish Date - Oct 19 , 2024 | 12:28 AM
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టా లని చూస్తే సహించేది లేదని విజిలెన్స ఎస్పీ వైటీపీటీఏ ప్రసాద్ హెచ్చ రించారు. ఆయన శుక్రవారం విజిలెన్స కార్యాలయంలోని తమ చాంబర్‌లో కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతపురం న్యూటౌన, అక్టోబరు18: ప్రభుత్వ ఖజానాకు గండికొట్టా లని చూస్తే సహించేది లేదని విజిలెన్స ఎస్పీ వైటీపీటీఏ ప్రసాద్ హెచ్చ రించారు. ఆయన శుక్రవారం విజిలెన్స కార్యాలయంలోని తమ చాంబర్‌లో కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. శాఖపరమైన పలు అంశాలపై చర్చించారు. అందులో భాగంగా విధినిర్వహణలో భాగంగా ఎప్పటి ఫైల్స్ అప్పుడు పూర్తి అయ్యేలా, సమస్యలు తలెత్తకుండా చూ డాలని ఆదేశించారు. పన్నుల ఎగవేత, ఖనిజ సంపద, సహజ వనరులు, ఎరువులు. పురుగుల మందులు, పీడీఎస్ బియ్యం సరఫరా తదితర వాటి లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. వీటిపై సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ప్రజలపై భారం పడకుండా తమవంతు చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంగించినట్లు తేలితే వదిలే ప్రసక్తి లేదన్నారు. రెగ్యులర్ తనిఖీలు చేపట్టి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలన్నా రు. ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్ము చేరాలని సూచించారు. డీఎస్పీ నాగభూషణ, సూపరిండెంట్ శర్మ, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ఫణింద్రనాథ్ రెడ్డి, ఏఓ వాసుప్రకాస్, డీసీటీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....