FESTIVAL : నేడు మిలాద్-ఉన-నబీ
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:15 AM
ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ముస్తాబైన దర్గాలు, మసీదులు
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 15 : ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉదయం ’జులుసే మహ్మదీయా’ పేరు తో శాంతిర్యాలీలు, మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు, సాయంత్రం మహమ్మద్ ప్రవక్త కేశాన్ని దర్శనం జరుపుకోనున్నారు ముస్లీం సోదరులు. పండుగను పురస్కరించుకుని మసీదులు, దర్గాలు విద్యుద్దీపాలంకరణల్లో ఆకట్టుకుంటున్నాయి.
సర్వ మానవాళికి ఆదర్శప్రాయం మహ్మద్ ప్రవక్త
- కేఎం షకీల్ షఫి, ముతవల్లిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సమాజ శ్రేయస్సును కాంక్షించే బోధనలతో మహ్మద్ ప్రవక్త సర్వమానవాళికి ఆదర్శంగా నిలిచారు. ప్రవక్త బోధనల సారాంశాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలి. కులమతాలకు అతీతంగా ప్రవక్త ఆశీస్సులు అన్ని వర్గాలవారికి అందాలనే ఉద్దేశంతో ప్రతియేటా మిలాద్ ఉన నబీ సందర్భంగా ప్రవక్త పవిత్ర కేశదర్శనం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....