ROAD : నగరంలో మారని రోడ్ల తీరు
ABN , Publish Date - Oct 17 , 2024 | 12:09 AM
జిల్లా కేంద్రమైన నగరంలో రహదారుల విషయంలో ఇంకా మార్పు రాలేదు. చాలా చోట్ల ఇంకా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో గుంతలు లేని రోడ్లు చేస్తామని గొప్పలు చెప్పినా అమలుకు నోచుకోలేదు. దాదాపు ఏడాది కాలంగా బిల్లులు కాకపోవడంతో, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
గుంతలతో నగరవాసుల అవస్థలు
అనంతపురం క్రైం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన నగరంలో రహదారుల విషయంలో ఇంకా మార్పు రాలేదు. చాలా చోట్ల ఇంకా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో గుంతలు లేని రోడ్లు చేస్తామని గొప్పలు చెప్పినా అమలుకు నోచుకోలేదు. దాదాపు ఏడాది కాలంగా బిల్లులు కాకపోవడంతో, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. పలు కారణాలతో కొన్ని టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో ఇంకా గుంతలు పడిన రోడ్లు వెక్కిరిస్తున్నాయి. వరుస వర్షాలతో గుంతలు పడిన రోడ్లలో ప్రయాణించడానికి నగరవాసులు భయపడాల్సి వస్తోంది. నగరంలోని రామ్‌నగర్‌లో పాత ఆర్టీఓ ఆఫీస్‌రోడ్డులోనే రిజిస్ర్టేషన కా ర్యాలయం, అపార్ట్‌మెంట్లతో పాటు దాదాపు 250కిపైగా కుటుంబాలున్నా యి. స్థానిక రోడ్డు గుంతలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు, తదితరులు వాపోతున్నారు. ఆ రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు. అలాగు నగరంలోని చాలా ప్రధాన రహదారు ల్లో సైతం గుంతలుండటంతో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....