Liquor stores : సహకరించని ఆనలైన
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:48 PM
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన రీఫండబుల్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు ...
పెండింగ్‌లో హైబ్రీడ్ చెల్లింపులు
మద్యం దుకాణ దరఖాస్తుదారులకు చుక్కలు
అనంతపురం అర్బన, అక్టోబరు 5: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన రీఫండబుల్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు దిక్కుతోచక ఎక్సైజ్ స్టేషన్లకు వెళ్లారు. జిల్లా ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ అధికారి పేరిట డీడీ తీసి, తగిన డాక్యుమెంట్లు సమర్పిస్తే తాము దరఖాస్తు చేస్తామని అధికారులు చెప్పడంతో పలువురు డీడీలు తీసి స్టేషనలో సమర్పించారు.
హైబ్రీడ్ ఇబ్బందులు
హైబ్రీడ్ పద్ధతిలో ఆనలైనలో దరఖాస్తు విధానం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఈ పద్ధతిలో ఆనలైనలో వివరాలు నమోదు చేసి, సీఎ్‌ఫఎంఎ్‌సలో మాన్యువల్‌గా దరఖాస్తు రుసుము చెల్లింపు ఆప్షనను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సిస్టమ్ జనరేట్ చేసిన రసీదును తీసుకొని ఎస్‌బీఐకి వెళ్లి రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా సొమ్ము చెల్లించి రెండు రోజులు గడిచినా వ్యాపారుల సెల్‌ఫోనకు ఓటీపీ రాలేదు. ఆనలైనలో దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో వ్యాపారులు బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒకే రోజు ఎనిమిది మంది వ్యాపారులకు ఈ సమస్య తలెత్తింది. ఈ సమస్యపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు సమాచారం. సమస్యల నేపథ్యంలో చివరి రోజు హైబ్రీడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే అంతే సంగతులని వ్యాపారులు అంటున్నారు.
ఎన్ని వచ్చాయో..
జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్లవారీగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారనే సమాచారం అధికారులు ఇవ్వడం లేదు. జిల్లా పరిధిలో అధికారులకు ఆనలైనలో వచ్చిన దరఖాస్తులను చూసుకునే యాక్సె్‌సను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరకు 56 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం సాయంత్రం దాకా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారన్న సమాచారం తెలియలేదు. సర్వర్ సమస్య కారణంగా దరఖాస్తులు ఎన్ని వచ్చాయో చెప్పలేమని స్థానిక అదికారులు అంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....