Share News

STREET LIGHTS : వెలగని వీధి లైట్లు

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:10 AM

పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి.

STREET LIGHTS : వెలగని వీధి లైట్లు
Street lights not lit in Dullpet Colony

దాదాపు 40 రోజులుగా ఇబ్బందులు పడుతున్న పలు కాలనీల వాసులు

నార్పల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి. ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదు. మరికొన్ని చోట్ల కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో నార్పలలోని దూల్‌పేట కాలనీ, చైతన్య కాలనీ, ఊయలకుంట, మసీదుకట్ట, చౌడమ్మ కట్ట, చింతవనం కొట్టాల, తిక్కయ్యస్వామి వీధి, దారాబాయి కొట్టాల, గవ్వలవీధితో పాటు పలు కాలనీల్లో దాదాపు 400కు పైగా వీధిలైట్లు వెలగడం లేదు. దీంతో ఆ యా కాలనీవాసులు రాత్రి అయితే చిమ్మచీకట్లోనే భ యాందోళనలో జీవనం సాగిస్తున్నారు.


ఇదే క్రమం లో రాత్రివేళ బయటకు వచ్చిన వారు పాములు, తేలు కాటుకు గురైన సంఘటనలు ఉన్నాయి. దూల్‌ పేట కాలనీకి చెందిన వివేక్‌ అనే బాలుడు, చౌడమ్మ కట్ట వీధికి చెందిన కాటమయ్య అనేవ్యక్తి పాముకాటు కు గురయ్యారు. అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. వీధిలైట్లు వెలగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని 40 రోజులుగా ఎన్ని సా ర్లు అధికారులకు ఆర్జీలు ఇస్తున్నా ప్రయోజనం లేకుం డా పోయిందని ఆయా కాలనీ వాసులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. తమకేమీ సంబంధంలేదన్నట్లు పం చాయతీ అఽధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారని మండిపడుతున్నారు. ఇక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళితే మేము ఏమి చేయాలి? త్వరలోనే వీధిలైట్ల న్లు వేయిస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతు న్నారని ఆయా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని త్వరలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఎం పీడీఓ గంగావతిని వివరణ కోరగా... నార్పల మేజర్‌ పంచాయతీలోని పలు కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వ రలోనే వీధిలైట్లు వేయిస్తామని ఎంపీడీఓ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 23 , 2024 | 12:14 AM