Share News

TDP : ఓటర్ల యూటర్న్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:51 PM

2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఉరవకొండ మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కంటే 1.88 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతను కనబరించింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అదే ఓటర్లు యూటర్న్‌ తీసుకున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. 1.90 లక్షలకుపైగా ఓట్ల అధిక్యతను టీడీపీకి ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థం అవుతుంది. బటన ...

TDP : ఓటర్ల యూటర్న్‌

జిల్లాలో టీడీపీకి 1.90 లక్షల ఓట్ల ఆధిక్యం

గత ఎన్నికల్లో వైసీపీకి 1.88 లక్షల ఓట్లు

ఈ ఎన్నికల్లో అంతకు మించి.. కూటమికి..

వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకతే కారణం

2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఉరవకొండ మినహా మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కంటే 1.88 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యతను కనబరించింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అదే ఓటర్లు యూటర్న్‌ తీసుకున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. 1.90 లక్షలకుపైగా ఓట్ల అధిక్యతను టీడీపీకి ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థం అవుతుంది. బటన నొక్కుడుతో అరకొరగా సంక్షేమ పథకాలు అమలు చేయడం మినహా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నది నిర్వివాదాంశం. ఇచ్చిన హామీలను కూడా వైసీపీ అమలు చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి అస్సలు పట్టించుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పన ఊసే మరిచిపోయారు. ఏ ఒక్క పరిశ్రమను జిల్లాకు తీసుకురాలేదు. ఇలా అనేక హామీలు మాటలకే పరిమితమయ్యాయి.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం


టీడీపీకి 1.90 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యత

జిల్లాలోని రాప్తాడు, అనంతపురం అర్బన, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో మొత్తం 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఈ ఎన్నికల్లో 16,36,448 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 8,89,119 ఓట్లు వచ్చాయి. అంటే 54.33 శాతం ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. 8 నియోజకవర్గాల్లోనూ కూటమి టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 1,90,794 ఓట్లు మెజార్టీని సాధించింది. ఇక వైసీపీ విషయానికొస్తే ఈ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకుగానూ వైసీపీకి 6,98,325 ఓట్లు వచ్చాయి. అంటే 42.67 శాతం ఓట్లు వచ్చాయి.


2019లో వైసీపీకి 1.88 లక్షల ఓట్ల ఆధిక్యత...

గత సార్వత్రిక ఎన్నికల్లో 8 నియోజకవర్గాలకుగానూ 7 నియోజకవర్గాలు వైసీపీ వశమయ్యాయి. ఉరవకొండ టీడీపీకి దక్కింది. జిల్లాలో మొత్తం ఓటర్లు 19,08,668 ఉండగా... అందులో 15,21,449 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 8,02,953 ఓట్లు వచ్చాయి. అంటే 52.77 శాతం ఓట్లు వచ్చాయి. 1,88,371 ఓట్లు మెజార్టీని సాధించింది. ఇక టీడీపీ విషయానికొస్తే... 8 నియోజకవర్గాల్లో 6,14,582 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీకి 40.39 శాతం ఓట్లు వచ్చాయి.

తేడా ఇదీ...

2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి 52.77 శాతం ఓట్లు రాగా... టీడీపీకి 40.39 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే వైసీపీకి 12 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. 2024 ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. టీడీపీకి 54.33 శాతం ఓట్లు రాగా... వైసీపీకి 42.67 శాతం ఓట్లు వచ్చాయి. 12 శాతం ఓట్లు టీడీపీకి అధికంగా రావడం గమనార్హం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 09 , 2024 | 10:51 PM