Share News

SKU : వర్సిటీల్లో వనమహోత్సవం

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:34 AM

ఎస్కేయూ ప్రాంగణ పరిసరాలను హరితవనంలా తీర్చీదిద్దుతామని రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రమేష్‌బాబు పేర్కొన్నారు. వర్సిటీ వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ రవిప్రసాద్‌ ఆధ్వర్యం లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా రెక్టార్‌ వెంకటనాయుడు, రిజిస్ర్టార్‌ రమేష్‌బాబు మొక్కలు నాటారు. వర్సిటీలో బొటానికల్‌ గార్డెన ఏర్పాటు కోసం వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరు వేల రకాల మొక్కలు పెంచుతున్నామని తెలిపారు.

SKU  : వర్సిటీల్లో  వనమహోత్సవం
SKU rector and registrar planting saplings

అనంతపురం సెంట్రల్‌, సెప్టెంబరు 17 : ఎస్కేయూ ప్రాంగణ పరిసరాలను హరితవనంలా తీర్చీదిద్దుతామని రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రమేష్‌బాబు పేర్కొన్నారు. వర్సిటీ వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ రవిప్రసాద్‌ ఆధ్వర్యం లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా రెక్టార్‌ వెంకటనాయుడు, రిజిస్ర్టార్‌ రమేష్‌బాబు మొక్కలు నాటారు. వర్సిటీలో బొటానికల్‌ గార్డెన ఏర్పాటు కోసం వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరు వేల రకాల మొక్కలు పెంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు జీవీ రమణ, మురళీధరరావు, ప్రిన్సిపాల్‌ సోమశే ఖర్‌, డీఆర్‌లు తిమ్మప్ప, శ్రీరాములు నాయక్‌, జీవీ చౌదరి, ఎస్‌ఈ మధుసూ దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సెంట్రల్‌ యూనివర్సిటీలో వీసీ కోరి మొక్కలు నాటారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటుచేసిన కొత్తవర్సిటీ ప్రాంగణంలో మొక్కలునాటి వచ్చే సంవత్సరానికి వనాన్ని తల పించేలాప్రణాళిక తయారుచేశామని తెలిపారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఎనఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:34 AM