Share News

JNTU : అత్యధిక వార్షికవేతనంతో ఉద్యోగాలు

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:02 AM

జేఎనటీయూ విద్యార్థులకు అత్యధిక వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తున్నా మని ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను గురువారం వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్‌ క్రిష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ దేవన్న అభినం దించారు.

JNTU : అత్యధిక వార్షికవేతనంతో ఉద్యోగాలు

జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జేఎనటీయూ విద్యార్థులకు అత్యధిక వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తున్నా మని ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను గురువారం వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్‌ క్రిష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ దేవన్న అభినం దించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ విద్యా సంవ త్సరం ప్రారంభమైన మూడునెలల్లోనే అనేక ప్రాంగణ నియామ కాలు చేపట్టామన్నారు. టీసీఎస్‌, సీటీఎస్‌, ఫ్యాక్ట్‌టెస్ట్‌, డెల్టాఎక్స్‌, మోషిప్‌, ఎల్‌అండ్‌టీ తదితర ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఇం టర్యూల్లోనే ప్రతిభ కనబరస్తూ రూ.10 లక్షల నుంచి రూ.12లక్షల వార్షిక వేత నంతో విద్యార్థులు ఉద్యోగాలు సాధి స్తున్నారని పేర్కొన్నారు. టీసీఎస్‌లో 121, ఎల్‌అండ్‌ టీలో 11, సీటీఎస్‌లో 9, ఫ్యాక్ట్‌ టెస్ట్‌లో 6, మోషిప్‌లో ముగ్గురు చొప్పున మొత్తం 150మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. సంస్థలకు అవస రమైన విధంగా విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి మాక్‌ ఇంటర్యూలు నిర్వహించడంతో వారిలోని మానసిక భయాందోళ నలు తొలగిస్తున్నట్లు తెలిపారు. తద్వారా మొదటి ఇంటర్యూల్లోనే ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టుల నిర్వహణ సమయంలోనే ప్రాంగణ నియామకాలు చేపట్టడం ద్వారా డిగ్రీతో పాటు ఉద్యోగాలతో విద్యార్థులు వెళ్తున్నారని హర్షం వ్యక్తంచేశారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, డైరెక్టర్‌ కిరణ్మయి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధర, ప్రాంగణ నియామకాల అధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 13 , 2024 | 12:02 AM