TDP : వరద బాధితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:18 AM
వరద బాధితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా ఉంటారని టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన మండలంలోని కళాకారుల కాలనీ, దండోరా కాలనీలోని ప్రజలకు గురువారం ఆయన బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
రాప్తాడు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా ఉంటారని టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన మండలంలోని కళాకారుల కాలనీ, దండోరా కాలనీలోని ప్రజలకు గురువారం ఆయన బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే పరిశీలించి వారికి భోజన వసతి కల్పిస్తున్నారని, నిత్యావసర సరుకులు అందజేసు ్తన్నారని తెలిపారు. భవిష్యత్తు లో కాలనీలు ముంపునకు గురి కాకుండా ఎమ్మెల్యే ముందస్తు చర్యలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ విజయకుమారి, సర్పంచులు తిరుపాలు, శశికళ, కన్వీనర్ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....