WEALTH CENTERS : చెత్తగా సంపద కేంద్రాలు
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:08 AM
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని భావించి 2014లో టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆదా యాన్ని పెంచేందుకు చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. స్వచ్ఛభారత కింద ఉపాది హామీ పథకంలో భాగంగా ఒక్కో కేంద్రం నిర్మా ణానికి దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు.
చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 6: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని భావించి 2014లో టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆదా యాన్ని పెంచేందుకు చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. స్వచ్ఛభారత కింద ఉపాది హామీ పథకంలో భాగంగా ఒక్కో కేంద్రం నిర్మా ణానికి దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు. రామగిరి మండలంలో 9, కనగానపల్లిలో 11, చెన్నేకొత్తపల్లి మండలంలో 14 నిర్మించారు. గ్రామాల్లో చెత్తసేకరణ కోసం గ్రీన అంబాసిడర్‌లను ఏర్పాటుచేశారు. అయితే ప్రస్తుతం చాలా వరకు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలో లేవు. దీంతో ఆ కట్టడాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీరు గారిన లక్ష్యం:- చెత్త నుంచి వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేసి రైతులకు అందించడం ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచాలన్నదే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆశయం. దీని వల్ల రసాయన ఎరువులు బదులు సేంద్రియ ఎరువులను రైతులకు సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. తడి, పొడి చెత్తను సంపద కేంద్రాలకు తరలించి దాని ద్వారా సంపద సృష్టించవచ్చని ఆశించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో చెత్తతో సంపద తయారీ కేంద్రాలపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో చాలాచోట్ల కేంద్రాలు నిరుపయోగంగా మారి పథకం లక్ష్యం నీరుగారింది.
నిలిచిపోయిన చెత్త సేకరణ:- సీకేపల్లి మండలంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు 14 ఉన్నాయి. మండల వ్యాప్తంగా గ్రీన అంబాసి డర్‌లను ఏర్పాటుచేశారు. వారు గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేక రించి కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేరుచేయాలి. అయితే మండలంలోని చాలా గ్రామాల్లో చెత్తసేకరణ జరగడంలేదు. అధికారులు మాత్రం కొన్ని కేంద్రాలు పనిచేస్తున్నాయని చెబుతున్నా అవి మొక్కుబడిగానే సాగుతున్నాయి. ఆ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అటకెక్కిందనే చెప్పవచ్చు.
జీతాలు రాక తప్పుకున్న గ్రీన అంబాసిడర్స్
చెత్త సేకరణ సిబ్బంది గ్రీన అంబాసిడర్‌చాలా మంది తమ విదుల నుంచి తప్పుకున్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో సక్రమంగా జీతాలు అందకపోవడంతో వారు చెత్త సేకరణకు ముందుకు రానట్టు తెలుస్తోంది.చెన్నేకొత్తపల్లి మండలంలో 44 మంది గ్రీన అంబాసిడర్లు నియమించగా ప్రస్తుతం 27 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు మండల పరిషత అధికారులు చెబుతున్నారు.కనగానపల్లిలో 25 మందిఉన్నారు. కొందరు పనిచేయడంలేదని తెలిసింది.
ఇప్పుడైనా మనుగడ సాధించేనా...?
సంపద కేంద్రాల నిర్వహణపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తీగా నిర్వీర్యమైన కేం ద్రాల మనుగడపై ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. దీంతో గ్రామ పంచాయతీల ఆధాయాన్ని పెంచాల్సినఅవసరం ఉంది.
త్వరలో వినియోగంలోకి తెస్తాం -అశోక్‌నాయక్, ఈఓఆర్‌డీ, సీకేపల్లి
మండలంలోని పలు చోట్ల సంపద కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేని మాట వాస్తవమే. ప్రస్తుతం స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో ఈ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. త్వరలో అన్నింటిని వినియోగంలోకి తీసుకువస్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....