Share News

Transfers : ఏంటో.. ఇదంతా..!

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:27 AM

బదిలీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అయోమయం కొనసాగుతోంది. ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం లో ఉన్న అధికారులు, ఇతర ఉద్యోగులను మార్చుకోవడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా చాలా శాఖలలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయలేదు. దీనివల్ల కొన్ని శాఖలలో సమస్యలు...

Transfers : ఏంటో.. ఇదంతా..!
Collector Office

బదిలీలపై అయోమయం

15కి ముగియనున్న గడువు

ఏశాఖలోనూ కనిపించని స్పష్టత

కీలకంగా మారిన కలెక్టరు నిర్ణయం

అనంతపురం టౌన, ఆగస్టు 8: బదిలీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అయోమయం కొనసాగుతోంది. ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం లో ఉన్న అధికారులు, ఇతర ఉద్యోగులను మార్చుకోవడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా చాలా శాఖలలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయలేదు. దీనివల్ల కొన్ని శాఖలలో సమస్యలు ఏర్పడుతున్నాయని భావించడంతో సీఎం చంద్రబాబు నాయుడు బదిలీలకు


ఆమోదం తెలి పారు. ఆగస్టు 15నుంచి 31లోగా బదిలీల ప్రక్రియ ముగించాలని సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా 16శాఖలకు మాత్రమే ఆ బదిలీలలో అవకాశం కల్పించారు. అయితే సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో బదిలీల ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో సెప్టెంబరు 15వరకు ఈబదిలీలకు గడువు పొడిగిస్తూ సీఎస్‌ మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు.

ఒక్క శాఖలో కూడా కనిపించని క్లారిటీ

బదిలీలకు సంబంధించి ఇప్పటికీ ఒక్క శాఖలో కూడా క్లారిటీ కనిపించడం లేదు. సీఎస్‌ ఏమి ఉత్తర్వులు ఇచ్చారో? ఇక్కడ కలెక్టరు ఎలాంటి మార్గదర్శకాలు అమలు చేస్తున్నారో? ప్రజాప్రతినిఽధులు నుంచి ఎలాంటి సిఫార్సులు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడంలేదు. అత్యంత కీలకమైన రెవెన్యూ, జడ్పీ, పంచాయతీరాజ్‌శాఖలలో ఈగందరగోళం అధికంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో జరిగే బదిలీలకు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల నుంచి చాలామంది సిపార్సు లేఖలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కలెక్టరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావడం లేదనే చర్చ ఉద్యోగుల్లో సాగు తోంది. జిల్లాస్థాయి ఉన్నతాధికారుల బదిలీల విషయంలోను ఇదే గందర గోళం సాగుతోంది. జిల్లాలో అత్యంత కీలకమైన ఆర్డీఓలు, డీఆర్‌డీఏ, డ్వామా శాఖల పీడీలు, డీపీఓ, ఎస్‌ఎ్‌సఏ పీఓ అధికారుల నియామకంలోను అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఇందులో ఒక్క పోస్టుపై కూడా క్లారిటీలేదు. ఈపోస్టులకు రాష్ట్రస్థాయిలో ఆయాశాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నియామకం జరిగి ఉంటే స్థానిక బదిలీలలో ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఉండేది. కొత్త అధికారులు రాకపోవడం తో ఈబదిలీల వ్యవహారంలో కలెక్టరు అత్యంత కీలకంగా మారిపోయాడు. ఆ కలెక్టరు నిర్ణయాలపైనే ఇపుడు అందరి దృష్టి ఉంది,

తహసీల్దార్ల తంటా ?

ఇప్పటికే జిల్లాలో తహసీల్దార్ల బదిలీల వ్యవహారంలో అసంతృప్తి కొనసాగుతోంది. కొంతమంది నియామకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు తహసీల్దార్లు ఇప్పటికీ బదిలీ అయిన స్థానంలో చేరలేదు. మరికొంతమంది జాయిన అయినా వారిని మార్చాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు చర్చసాగుతోంది. దాదాపు రెండు నెలలుగా ఏడుగురు తహసీల్దార్లు త్రిశంకుస్వర్గంలో ఉంటూ వస్తున్నారు. ఆ ఏడుగురిలో మోహనకుమార్‌ (కూడేరు), ఈశ్వరమ్మ(తాడిపత్రి), అలెగ్జాండర్‌ (రాయదుర్గం), షర్మిల (బెళుగుప్ప), వాణిశ్రీ( అనంతపురం రూరల్‌, ఉషారాణి( గుంతకల్లు ఆర్డీఓ ఆఫీ్‌స)కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ ఏడుగురు అక్కడ జాయిన కాలేదు, మార్పులు చేర్పులు చేసి వీరిస్థానంలో కొత్తవారిని నియమిస్తారని అందరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఇందుకు కలెక్టరు వినోద్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈబదిలీలు కలెక్టరు, జిల్లా ప్రజా ప్రతినిధుల మధ్య కొంత దూరం పెంచాయన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 15లోగా బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఈనెల 14న రెండో శనివారం, 15న ఆదివారం ఉంది. అంటే ఈనెల 13కల్లా ఈబదిలీల పక్రియ ముగించాల్సి ఉంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 09 , 2024 | 12:27 AM