CORPORATION : ఏమిటీ మతలబు..?
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:09 AM
నగరపాలికలో అడ్డగోలు వ్యవహారాలు ఎక్కువగానే జరుగుతున్న బహరంగ విమర్శలు ఉన్నాయి. తాజాగా నగరపాలిక కమిషనర్ కొన్ని రోజుల క్రితం రూ.14లక్షలకు చెక్కు ఇచ్చారు. కానీ ఆ డబ్బు జమ చేయవద్దని కమిషనర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఒత్తిళ్లతో నగర కమిషనర్ ఆ పనిచేశారా..? లేక ఏదైనా మతల బుందా..?అనేది అంతుబట్టడం లేదు. గత ప్రభుత్వంలో కుక్కల నియంత్రణ (ఏబీసీ), యాంటీ రాబిస్ వ్యాక్సినేషన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాజస్థాన రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన సం తులన జీవ్ కళ్యాణ్ అనే సంస్థ టెండరు దక్కించుకుంది.
కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన
వ్యవహారంపై పలువురి సందేహాలు
రూ.14లక్షల చెక్కు ఇచ్చిన కమిషనర్
అంతలోనే సంస్థ ఖాతాకు
జమ చేయవద్దని కోరిన వైనం
అనంతపురం క్రైం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరపాలికలో అడ్డగోలు వ్యవహారాలు ఎక్కువగానే జరుగుతున్న బహరంగ విమర్శలు ఉన్నాయి. తాజాగా నగరపాలిక కమిషనర్ కొన్ని రోజుల క్రితం రూ.14లక్షలకు చెక్కు ఇచ్చారు. కానీ ఆ డబ్బు జమ చేయవద్దని కమిషనర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఒత్తిళ్లతో నగర కమిషనర్ ఆ పనిచేశారా..? లేక ఏదైనా మతల బుందా..?అనేది అంతుబట్టడం లేదు. గత ప్రభుత్వంలో కుక్కల నియంత్రణ (ఏబీసీ), యాంటీ రాబిస్ వ్యాక్సినేషన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాజస్థాన రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన సం తులన జీవ్ కళ్యాణ్ అనే సంస్థ టెండరు దక్కించుకుంది. నగరపాలికలో కుక్కలను పట్టింది. ఈ ప్రక్రియను పశుసంవర్థక శాఖకు అనుసంధానం చేశారు. కొన్ని కుక్క లను పట్టి ఆపరేషన చేశామని, వ్యాక్సినేషన వేశామని సంస్థ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం రూ.14లక్షల చెక్కును అందజేశారు. దీనిపై ప్రస్తుతం వివాదం రేగుతోంది.
ఒక్కో కుక్కకు రూ.1500...
నగరపాలిక పరిధిలో కుక్కల నియంత్రణ కోసం సంతులన జీవ్ కళ్యాణ్ ఏజెన్సీ నగరానికి వచ్చింది. గుత్తి రోడ్డులోని డంపింగ్‌యార్డు ఆవరణలో ప్రత్యేకం గా షెడ్డు నిర్మించి, అందులో కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన కార్యక్రమం చేపట్టారు. 2023లో టెండరు దక్కించుకున్న ఈ ఏజెన్సీ నగరపాలికలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ కార్యక్రమం చేపట్టింది. అయితే గుట్టు గా చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. 2500 కుక్కలకు ఆపరేషన చేసినట్లు ఆ సంస్థ చెప్పుకొచ్చిం ది. ఆ మేరకు రూ.40లక్షలకు బిల్లులు పెట్టారు. అ యితే తొలుత 976 కుక్కలకు రూ.1500 చొప్పున రూ.14,64,400కు బిల్లు సిద్ధం చేయడంపైనా అను మానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇంజనీరిం గ్ విభాగం నుంచే బిల్లు వెళ్లాలి. కానీ హెల్త్ విభాగం నుంచి వెళ్లింది. ఎఫ్1 నుంచి వెళ్లిన ఆ ఫైల్ శానిటరీ ఇనస్పెక్టర్లు, ఎంహెచఓ ద్వారా నేరుగా అప్పటి కమిషనర్‌కు చేరిది. ఈ యేడాది జూనలో ఆ ఫైల్‌పై అప్పటి కమిషనర్ మేఘస్వరూప్ సంతకం చేసి అప్రూవల్ ఇచ్చినా పేమెంట్ చేయించలేదు. తరువాత వచ్చిన కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఆ ఫైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
చెక్కు ఇచ్చారు...పేమెంట్ వద్దన్నారు
నగర కమిషనర్ జనరల్ ఫండ్ నుంచి రూ.14,34,720 చెక్కును ఆ ఏజెన్సీకి అందజేశారు. ఇక్కడ కమిషనర్ చెక్కు రూపంలో ఇవ్వడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా సీఎఫ్‌ఎం ఎస్‌లో బిల్లు పెట్టాలి. అత్య వసర పనులైన వాటర్ వర్క్స్ లాంటి పనులకు తప్ప మిగిలినవాటికి చెక్కు లివ్వరని నగరపాలిక వర్గాలు చెబుతున్నాయి. మరి కమిషనర్‌పై ఒత్తిళ్లు పనిచేశాయా..?లేక ఎవరైనా అమ్యామ్యాలకు పాల్పడి కమిషనర్‌ను బురిడీ కొట్టిం చారా..?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రూ.14లక్షలతో పాటు మిగిలిన బిల్లులు చేయించుకు నే క్రమంలో కొందరికి డబ్బులిచ్చారనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఈ నెల 12 మేయర్ చాంబర్‌లో ఇంజ నీర్లతో జరిగిన సమావేశంలో మేయ ర్, డిప్యూటీ మే యర్ దీనిపై కమిషనర్‌తో వాదనకు దిగారు. రూ.14 లక్షల చెక్కు ఎందుకిచ్చారని వారు ప్రశ్నించగా, ని బంధనల మేరకే ఇచ్చానని కమిషనర్ సమాధానమి చ్చారు. కౌన్సిల్‌లో లేవనెత్తుతామని వారనగా...తాను తన స్టాండ్‌పై ఉంటానన్నారు. కానీ విచిత్రంగా అదే రోజు కమిషనర్ సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు ఆ చెక్కు ద్వారా జరిగే పేమెంట్‌ను ఆపాల ని లేఖ రాయడం గమనార్హం. ఇది హాట్ టాపిక్‌గా మారింది.
నిబంధనల మేరకే...- నాగరాజు, కమిషనర్
నిబంధనల మేరకే సంతులన జీవ్ కళ్యాణ్ ఏజెన్సీ వారికి రూ.14లక్షల చెక్కు అందజేశాం. అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే స్టాప్ చేయమని బ్యాంకు వారిని కోరాం. విచారించి ఇస్తామని ఏజెన్సీ వారికి చెప్పాం. మిగిలిన విషయాలు సందర్భం వచ్చినప్పుడు చెబుతాం.