Share News

PUBLIC FORM : ప్రజావేదిక అవినీతి గోరంతేనా..?

ABN , Publish Date - Dec 05 , 2024 | 12:14 AM

మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ 2,07,159 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీబృందం సభ్యులు తేల్చారు. స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామాపీడీ విజ యేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వారీగా తనిఖీల వివరాలను వెల్లడించారు.

PUBLIC  FORM : ప్రజావేదిక అవినీతి గోరంతేనా..?
Officials are getting the details in the public forum

జరిగిన పనులు రూ. 15 కోట్లు

తేలిన అవినీతి రూ. 2.07 లక్షలు

చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ 2,07,159 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీబృందం సభ్యులు తేల్చారు. స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామాపీడీ విజ యేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వారీగా తనిఖీల వివరాలను వెల్లడించారు. 2023 ఏప్రిల్‌ 1నుంచి 2024 మార్చి 31వరకు దాదాపు రూ. 15. 02లక్షలు పనులు జరిగాయని తెలిపారు. ఇందుకు సంబంధించి నవం బరు 19వ తేదీ నుంచి ఈ నెల 3 వరకు సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల్లో పరిశీలించారని తెలిపారు. ప్రధానంగా ఉపాదిహామీ పథకంలో రెగ్యులర్‌గా జరిగిన పనులతో పాటు హౌసింగ్‌, హార్టి కల్చర్‌, సీసీరోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలైన వాటిపై క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి రూ. 2,07, 159 మాత్రమే అవినీతి జరిగినట్లు తేలిందని ఏపీఓ గోవిందరాజునాయక్‌ బహిరంగ చర్చావేదికలో తె లిపారు. మండలంలోని 15 పంచాయతీలకు సంబందించి పులేటిపల్లిలో అధికంగా రూ. 46వేలు, బసినేపల్లిలో అత్య ల్పంగా రూ. 3వేలు అవినీతి జరిగినట్లు తేలిందన్నారు. ఈ అవినీతి సొమ్ము రికవరీకి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కాగా ఈసామాజిక తనిఖీ తీరుపై మండలంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులుదులుపుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కార్య క్రమంలో డీవీవీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ శివశంకరప్ప, అం బుడ్స్‌మెంటు వెంకటశివారెడ్డి, ఏపీఓ గోవిందరాజ్‌ నాయక్‌, ఎస్సార్పీ చంద్రమోహన, టీడీపీ మండల కన్వీనర్‌ ముత్యాల రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేశు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాదిహామీ సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 05 , 2024 | 12:14 AM