BIRTH CERTIFICATE : జనన ధ్రువపత్రాలు ఎప్పుడిస్తారు..?
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:35 AM
మా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు ఎప్పుడిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులకు వన ఇండియా- వన అపార్ ఐడీ కోసం వారి తల్లిదండ్రుల అవస్థలు చెప్పనలవి కాదు. జనన ధ్రువీకరణ లేదా ఆధార్ కార్డు లేదా యూ-డైస్‌లో ఎక్కడ చిన్న అక్షరం తేడా ఉన్న అపార్ కార్డు జనరేట్ కాకాపోవడంతో తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు తెలుపుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రుల వాగ్వాదం
శింగనమల, నవంబరు 4(ఆంధ్రజ్యోతి) : మా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు ఎప్పుడిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులకు వన ఇండియా- వన అపార్ ఐడీ కోసం వారి తల్లిదండ్రుల అవస్థలు చెప్పనలవి కాదు. జనన ధ్రువీకరణ లేదా ఆధార్ కార్డు లేదా యూ-డైస్‌లో ఎక్కడ చిన్న అక్షరం తేడా ఉన్న అపార్ కార్డు జనరేట్ కాకాపోవడంతో తప్పని సరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు తెలుపుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీసుస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకుని వారాలు గడుస్తున్నా అధికారులు జాప్యం చేస్తున్నారని తల్లిదండ్రు లు వాపోతున్నారు. విద్యార్థి జనన ధ్రువీకరణ కార్యాలయంలోని రిజిస్టర్‌లో లేకపోతే అధికారులు ఫారం-10 జారీ చేయడానికి 10 రోజులుపైగా పడు తోంది. ఫారం-10 తీసుకుని ఆ విద్యార్థి పేర మీద నోటరీ తీసుకోవడానికి, తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి తదితరాలకు సమయం ఎక్కువగా కావడమే కాకుండ, అదనంగా మరో రూ. వేయికి పైగా ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన చిన్నజలాలపురానికి చెందిన బోయ నరేంద్ర, పెరవలికి చెందిన కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ... తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం దాదాపు 20 రోజుల కిందటే దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటి వరకు అందలేదన్నారు. నా పుట్టిన తేది తప్పుగా ఉందని వెంటనే జనన ధ్రువీకరణ పత్రం తీసుకు రమ్మని మా టీచర్ తెలిపారని రాచేపల్లికి చెందిన రత్నదీప్ అనే విద్యార్థి తెలిపాడు. అయితే ఇక్కడ పని కావడంలేదని వాపోయాడు. ఎన్నిరోజులకు ఇస్తారోనని అంటున్నారు.
ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం - తహసీల్దార్, సాకే బ్రహ్మయ్య
జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న రిజిస్టర్ నమోదైన వాటికి వెంటనే ఇస్తున్నాం. రిజిస్టర్‌లో లేని వాటి కోసం ఫారం-10 ఇస్తున్నాం. దరఖాస్తులు ఎక్కవగా రావడంతో కొద్దిగా అలస్యం అవుతోంది. రెండు రోజుల్లోగా దరఖాస్తు చేసుకున్న అందరికీ పత్రాలు జారీ చేస్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....