Share News

JC ASHMITH REDDY : నిస్వార్థంగా సేవ చేస్తా..!

ABN , Publish Date - May 07 , 2024 | 12:48 AM

తాడిపత్రి ప్రజలే మా కుటుంబానికి దేవుళ్లు... నిస్వార్థంగా సేవచేయడం తప్ప మరేమిచ్చినా జేసీ ఫ్యామిలీ వారికి రుణం తీర్చుకోలేదు..’ అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు.. ఫ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? అశ్మిత: ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మా నాయన చేసిన అభివృద్ధే తప్ప ఈ ఐదేళ్లల్లో పాల..

 JC ASHMITH REDDY : నిస్వార్థంగా సేవ చేస్తా..!
JC Ashmita Reddy

తాడిపత్రి ప్రజల రుణం తీర్చుకోలేనిది..

టీడీపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి టౌన, మే 5: ‘తాడిపత్రి ప్రజలే మా కుటుంబానికి దేవుళ్లు... నిస్వార్థంగా సేవచేయడం తప్ప మరేమిచ్చినా జేసీ ఫ్యామిలీ వారికి రుణం తీర్చుకోలేదు..’ అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు..

- ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?

అశ్మిత: ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మా నాయన చేసిన అభివృద్ధే తప్ప ఈ ఐదేళ్లల్లో పాలకులు చేసిందేమి లేదని ప్రజలు అంటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మంచి చేస్తే ప్రజలు గుండెల్లో


పెట్టుకుంటారనడానికి ఇదే నిదర్శనం. ‘అన్నా చదువుకున్న మీలాంటోళ్లు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి’ అని చెప్పడం నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రచారంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారం మరువలేనిది.

- అభివృద్ధి చేశామని పాలకులు చెబుతున్నారే...

అశ్మిత: నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని ఎవరిని అడిగినా చెబుతారు. మేం ఏ అభివృద్ధి పనిచేసినా వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అడ్డుపడటం పరిపాటిగా మారింది. ఎక్కడ మా ఫ్యామిలీకి మంచిపేరు వస్తుందో అని, ఎన్నికలు దగ్గరపడడంతో హడావుడిగా ఏరియా ఆసుపత్రి భవనం ప్రారంభించారు. అందులో ఎలాంటి సౌకర్యాలూ లేవు.

-గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారు?

అశ్మిత: సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను. తాడిపత్రి పట్టణంలో అండర్‌డ్రైనేజీ నిర్వహణ, చెత్తసేకరణ సరిగా లేదు. మునుపటి కంటే మరింత మెరుగ్గా చేస్తాను. విద్యార్థుల కోసం యాడికి, పెద్దవడుగూరు మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయిస్తాను. యువత సొంతంగా ఉపాధి పొందేలా చేస్తాను.


- గ్రానైట్‌ పరిశ్రమలను తెరిపిస్తారా?

అశ్మిత: తాడిపత్రి నల్లబండలు, గ్రానైట్‌కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వైసీపీ అధికారంలోకి రాగానే గ్రహణం పట్టింది. వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. నారా లోకేష్‌ను కలిసిన ప్రతిసారి ఈ విషయాన్ని చెప్పాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిశ్రమలకు పూర్వవైభవం కచ్చితంగా తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.

-టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతున్నారా?

అశ్మిత: వందశాతం నమ్ముతున్నారు. ఎప్పుడెప్పుడు టీడీపీ పాలన వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోపై యువత, మహిళలు ఆనందంగా ఉన్నారు.

- అరాచకశక్తులను ఎలా ఎదుర్కొంటారు?

అశ్మిత: గత ఎన్నికల్లో నాపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటిపైకి వచ్చారు. ఆ సమయంలో అప్పటి పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. ప్రస్తుతం పోలీసు అధికారులు బాగా పనిచేస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో వైసీపీవారు చేసే కుట్రలు, కుతంత్రాలు, దాడులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. తాడిపత్రిలో రౌడీయిజం లేకుండా కూకటి వేళ్లతో పెకిలిస్తా..


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 07 , 2024 | 12:48 AM