Home » JC Prabhakar Reddy
జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా.. హైలెట్ అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సైతం ఇప్పుడు ప్రధాన వార్తల్లో నిలిచాయి. కొంత మంది మహిళలతో మాట్లాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటారు. తాజాగా తాడిపత్రి యువతకు వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Andhrapradesh: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్లే ఇసుక దందా చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు..
Andhrapradesh: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంతో జేసీ ముందుకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ (YSRCP) హడావుడి చేస్తుండగా.. కూటమి (NDA Alliance) మాత్రం పోలవరం, అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సరిగ్గా..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి నుంచి భారీ కాన్వాయ్‌తో బుధవారం ఆయన అనంతపురానికి వచ్చారు. వందలాదిమంది అనుచరులతో కలిసి నల్లకండువాలు ధరించి.. వనటౌన పోలీసు స్టేషనకు వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్టేషనలోనికి ...
Andhrapradesh: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచె విప్పి కొడతామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. గెలిచినా, ఓడినా ఫ్యాక్షన మొదలు పెడతానని పెద్దారెడ్డి బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చశారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే వైసీపీ హయాంలో ..
‘వైసీపీ ప్రభుత్వంలో మా కుటుంబాన్ని వేధించారు. దొంగ బస్సులు తెచ్చామని కేసులు పెట్టారు. అధికారులకు పది రోజులు గడువు ఇస్తున్నా. నేను దొంగనని నిరూపించాలి. లేదంటే ఎస్పీ ఆఫీస్ వద్ద నా కొడుకు, కోడలు.. డీటీసీ ఆఫీస్ వద్ద నేను, నా భార్య కూర్చుంటాం’ అని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ....