Share News

ROADS : ఈ రోడ్లకు మోక్షమెప్పుడో..?

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:39 AM

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎక్కడ చూసినా గంతలమయమైన రహదారులే దర్శనమిచ్చాయి. వా టిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు నర కయాతన పడ్డారు. ఈ రోడ్లకు కూటమి ప్రభుత్వంలో నైనా మోక్షం కలుగుతుందా...? అని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ROADS : ఈ రోడ్లకు మోక్షమెప్పుడో..?
The bumpy Kottalapally road

అంతా గుంతలమయం

ప్రయాణమంటే భయపడుతున్న గ్రామీణులు

గార్లదిన్నె, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎక్కడ చూసినా గంతలమయమైన రహదారులే దర్శనమిచ్చాయి. వా టిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు నర కయాతన పడ్డారు. ఈ రోడ్లకు కూటమి ప్రభుత్వంలో నైనా మోక్షం కలుగుతుందా...? అని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రమైన గార్లదిన్నె నుంచి కోటంక గ్రామానికి వెళ్లే సుమారు 12 కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా గుంతల మ యమైంది. ఈ రోడ్డుపై ప్రయాణం సుమారు గంటకు పైగానే పడుతోంది. దీనికి తోడు దుమ్ముధూళి తో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. నిత్యం ఈ రోడ్డుపై కోటంక సుబ్రహ్మణ్యేశ్వరస్వా మికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అదేవిధంగా కమలాపురం క్రాస్‌ నుంచి కమలాపురం, కేకే తండా, కొట్టాలపల్లి, కొప్పలకొండ, కేశవాపురం గ్రామాల ప్రజలు నిత్యం వివిధ పనుల నిమిత్తం గార్లదిన్నె, అనంతపురానికి ఆటోల్లో, ద్విచక్ర వాహనాల్లో వెళ్తుంటారు. రోడ్డు గుంతలు పడడంతో ప్రయాణం చేయలేక పోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గంతలమయమైన రహదారు లకు మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికా రులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లే దు. దీంతో చేసేదేమీలేక ఆ రోడ్లపై ప్రయాణం చేస్తూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ రోడ్లకు మోక్షం కలిగేనా అని ఆయా గ్రామాల ప్రజల ఎదురుచూస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 29 , 2024 | 12:39 AM