RAIN : గాలి, వడగండ్ల వాన బీభత్సం
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:17 AM
మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ దురు గాలి, వడగండ్లవాన బీభత్సం సృష్టించాయి. వాటి ధాటికి పలు పంట లు దెబ్బతినడంతో రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రేకుల దుకా ణాలు, షెడ్లు, విద్యుతస్తంభాలు పలు చెట్లు నేలకొరిగాయి. సీకేపల్లి జాతీయ రహ దారి పక్కన గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాధాక్రిష్ణ ఏర్పాటు చేసు కున్న రేకుల దుకాణాలు తీవ్రమైన గాలుల ధాటికి రహదారి అవతల ఉన్న లేఔట్లలోకి ఎగిసిపడ్డాయి.
ఎగిరిపోయిన దుకాణాల రేకులు
దెబ్బతిన్న పంటలు, నేలకొరిగిన విద్యుతస్తంభాలు
నష్టపోయిన రైతులు
చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 3: మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ దురు గాలి, వడగండ్లవాన బీభత్సం సృష్టించాయి. వాటి ధాటికి పలు పంట లు దెబ్బతినడంతో రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రేకుల దుకా ణాలు, షెడ్లు, విద్యుతస్తంభాలు పలు చెట్లు నేలకొరిగాయి. సీకేపల్లి జాతీయ రహ దారి పక్కన గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాధాక్రిష్ణ ఏర్పాటు చేసు కున్న రేకుల దుకాణాలు తీవ్రమైన గాలుల ధాటికి రహదారి అవతల ఉన్న లేఔట్లలోకి ఎగిసిపడ్డాయి. దీంతో ఆంజనేయులుకు చెందిన సరుకులు, రేకుల బంక్ పూర్తిగా దెబ్బతిని దాదాపు రూ.80వేలు, రాధాక్రిష్ణకు రూ.40 వే ల వరకు నష్ట సంభవించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హోర్డింగ్‌లు, విద్యుత స్తంభాలు, ట్రాన్సపార్మర్లు, అక్కడక్కడ చెట్లు కూడా నే లకొరిగాయి. దీంతో స్థానికంగా విద్యుతఅంతరాయం ఏర్పడింది. ట్రాన్సకో సి బ్బంది గురువారం ఉదయం మరమ్మతులు చేపట్టి విద్యుతను పునరుద్ధరించారు.
దెబ్బతిన్న పంటలు: గాలివాన బీభత్సానికి స్థానికం గా పలువురు రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నారు. రైతలకు నష్టాన్ని మిగిల్చాయి. ప్రధా నంగా టమోట, గోరుచిక్కుడు పంటల కు నష్టం వాటిల్లింది. జేబీ నరసిం హులు రెండెకరాల్లో, అమరేంద్రరెడ్డి రెండెకరాలు, నాగేంద్ర రెండున్నర ఎకరా, బన్యాల సూర్యనారాయణ ఒకటిన్నర ఎకరాల్లో సాగుచేసిన టమోట పంట దెబ్బతిందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దామోదర్‌రెడ్డి, కుళ్లాయరెడ్డిలతో పాటు మరికొందరు రైతులకు చెందిన గోరుచిక్కుడు పంటకు కూడా నష్టం వాటిల్లింది. కాగా మండలంలో పలు గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, పలువురు రైతులు తొల గించిన వేరుశనగపంట తడిసి ముద్దైంది. దెబ్బతి న్న పంటలను అధికారులు పరిశీలించి ఆదుకోవాలని బాఽధిత రైతులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....