Share News

COLONY : అధ్వానంగా వైఎస్సార్‌ కాలనీ

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:38 AM

మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

COLONY : అధ్వానంగా వైఎస్సార్‌ కాలనీ
Crazy plants grown between houses in YSR Colony

ఇళ్ల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలు

విషసర్పాల సంచారం

అనంతపురం రూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత పంచాయతీ పరిధిలోని రోడ్లు, కాలువలను శుభ్రం చేయడంపై స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు. కాలనీలో ఎక్కువ శాతం మట్టిరోడ్లు కావడం, ఖాళీ స్థలాలు ఉండటం వల్ల పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు బాగా పెరిగి పోయాయి. దీంతో కాలనీ విషసర్పాలకు నిలయం మారిందని స్థానికులు వాపోతున్నారు. కనీసం పిచ్చిమొక్కలు తొలగించినా కొంత ఊరటగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 03 , 2024 | 12:38 AM