YCP leaders Attack : మాకే ఎదురు నిలబడతావా?
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:00 AM
మండలంలోని మారెంపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గొల్ల మారుతి, గొల్ల శీనప్పలపై వైసీపీ నాయకుడు సింగల్ విండో మాజీ అధ్యక్షులు మారెన్న కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. సాయంత్రం గొల్ల మారుతి దేవాలయం వద్ద కూర్చుని ఉండగా ఏరా గ్రామంలో నీది ఎక్కువైందని శ్రీకాంత అనే వ్యక్తి వచ్చి దాడి చేశాడు. నన్నెందుకు కొడుతున్నావురా అంటే ఏరా మాకే ఎదురు నిలబడతావా మమ్మల్ని...
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి
కణేకల్లు, జూన 23: మండలంలోని మారెంపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గొల్ల మారుతి, గొల్ల శీనప్పలపై వైసీపీ నాయకుడు సింగల్ విండో మాజీ అధ్యక్షులు మారెన్న కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. సాయంత్రం గొల్ల మారుతి దేవాలయం వద్ద కూర్చుని ఉండగా ఏరా గ్రామంలో నీది ఎక్కువైందని శ్రీకాంత అనే వ్యక్తి వచ్చి దాడి చేశాడు. నన్నెందుకు కొడుతున్నావురా అంటే ఏరా మాకే ఎదురు నిలబడతావా మమ్మల్ని తగిలే ధైర్యం ఉందా అంని శ్రీకాంతతో పాటు ఆయన సోదరుడు వెంకటేశులు కలిసి మరింతగా కొట్టారు. అడ్డుగావెళ్లిన గొల్ల శీనప్పను సైతం చితకబాదారు. అక్కడ నుంచి బాధితుడు ఇంటికి వెళ్లినా వదలకుండా శ్రీకాంత, వెంకటేశులుతో పాటు బసవరాజు, అనిల్ మరో ఇద్దరు కలిసి కాళ్లతో తన్నుతూ పిడుగుద్దులు గుద్దారు. గాయపడిన మారుతి, శీనప్పలను కుటుంబసభ్యులు, స్థానికులు కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆసుపత్రి వద్ద వైసీపీ నాయకుల దౌర్జన్యం
బాధితులను కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత వైసీపీ నాయకుడు రామన్న అక్కడికి వచ్చి టీడీపీ నాయకులకు దమ్ముంటే రండిరా చూసుకుందాం. గీత గీస్తున్నా.. అంటూ సవాల్ చేస్తూ దౌర్జన్యపూరితమైన మాటలు మాట్లాడాడు. స్థానికంగా పోలీసులు ఉన్నప్పటికీ ఆ వైసీపీ నాయకుడిని మందలించడంలో విఫలమయ్యారు. గతంలో ఎస్ఐగా పనిచేసి సీఐగా ఉద్యోగోన్నతి పొందిన వ్యక్తి అండతోనే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారనే విమర్శలున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....