Share News

Live Updates: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల దౌర్జన్యం

ABN , First Publish Date - Sep 25 , 2024 | 07:49 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల దౌర్జన్యం
ABN Breaking

Live News & Update

  • 2024-09-25T17:41:10+05:30

    • కస్టడీకి జానీ మాస్టర్

    • హైదరాబాద్: చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్‌ను కస్టడీకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు

    • నాలుగు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

    • జానీ మాస్టర్‌ను న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం

    • ఈ రోజు నుంచి శనివారం సాయంత్రం 4:30 వరకు కస్టడీకి అనుమతి

  • 2024-09-25T16:00:46+05:30

    • కూటమి నేతలపై పేర్ని నాని ఫైర్

    • అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

    • తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం

    • తిరుమల, తిరుపతి పవిత్రత, లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారు.

    • పవిత్ర దేవాలయాన్ని, భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా చేశారు

    • కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారు: పేర్ని నాని

  • 2024-09-25T15:48:38+05:30

    • హైడ్రా వల్ల నిద్ర లేదు: మల్లారెడ్డి

    • హైదరాబాద్: మాజీమంత్రి మల్లారెడ్డి సంచలనం

    • హైడ్రా వల్ల ప్రశాంతత లేదు, నిద్ర లేదు

    • హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయి

    • నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో నిర్మించాను

    • ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్ల మీద పడేయడం సరికాదు

    • కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజమే

  • 2024-09-25T14:27:17+05:30

    వరద సాయం కోసం అదనంగా 13 వేల మంది దరఖాస్తు: సీఎం చంద్రబాబు

    • అమరావతి: వరద సాయం కోసం 13 వేల మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు.

    • కొత్తగా అప్లై చేసుకున్న వారిలో అర్హులకు సాయం అందిస్తాం.

    • అనర్హులు ఉంటే ఎందుకివ్వలేకపోయామో చెబుతాం.

    • నేనిక్కడ బటన్ నొక్కడం లేదు.. బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు.

    • నేరుగా బాధితుల ఖాతాలకే సాయం అందిస్తున్నాం.

    • కుమ్మరిపాలెంలోని 38 వార్డులోకి నీరే రాలేదు.. ఇళ్లు మునగలేదు.

    • కొందరు రెచ్చగొట్టి గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

    • వరద సాయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించను.

    • ఎవరైనా డబ్బులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి.

  • 2024-09-25T13:56:34+05:30

    వైసీపీకి మరో షాక్

    • విశాఖ:వైసీపీకి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ గుడ్ బై

    • వైసీపీకి రాజీనామా చేసిన రెహమాన్

    • కూటమి పార్టీలో చేరే అవకాశం

  • 2024-09-25T13:53:13+05:30

    ఏడీఆర్ డైరీపై కేసు

    • తిరుమల: కల్తీ నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీపై చర్యలు

    • టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీ పై ఫిర్యాదు

    • 10 లక్షల కేజీల నెయ్యి సప్లైకీ ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చాం: టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ.

    • జూన్ 12, 20, 25వ తేదీ, జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సప్లై చేసింది.

    • ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో ఉన్న పాత విధానాలతో టెస్టింగ్ నిర్వహించి, నెయ్యిని టీటీడీ వినియోగించింది.

    • లడ్డూ నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో NDBL సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

    • జూలై 6,12 వ తేదీల్లో ఏఆర్ డైరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం NDBL ల్యాబ్ కు పంపాం.

    • ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది.

    • కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22, 23, 27వ తేదిల్లో ఏఆర్ డైరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశాం.

    • నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డైరీ టీటీడీకి రిప్లై ఇచ్చింది.

    • టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం

    • టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డైరీ పై కేసు నమోదు చేయనున్న పోలీసులు.

  • 2024-09-25T13:36:56+05:30

    • బోట్ల ఇష్యూలో వైసీపీ కుట్ర: సీఎం చంద్రబాబు

    • అమరావతి: బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారు.

    • బోట్ల వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉంది.

    • బాధ్యత లేకుండా అంబోతుల మాదిరి వ్యవహరించారు

    • అనంతపురంలో రథం కాల్చేసారు

    • బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తాం.

    • ఎవరు ఏ తప్పు చేసినా తెలిసేలా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం.

    • ఎవరైనా కుట్రలు పన్నితే ఖబడ్దార్‌.

  • 2024-09-25T13:21:59+05:30

    • దేవర నిర్మాతకు ఏపీ హైకోర్టు షాక్

    • అమరావతి: దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

    • 14 రోజులు కాదు 10 రోజులే దేవర టికెట్ల ధరల పెంపు

    • టికెట్ ధరలు పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు.

    • 14 రోజులు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమో సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం

    • నెల్లూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ

  • 2024-09-25T13:17:46+05:30

    చంద్రబాబు కామెంట్స్

    • ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ మించి ఆర్థిక సాయం అందించాం.

    • ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా బాధితులకు సాయం అందిస్తున్నాం.

    • చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం.

    • అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక సాయం అనేదే కేంద్రం నిబంధనల్లో లేదు.

    • బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చాం.

    • పంట నష్టాన్ని కూడా భారీగా పెంచాం.

    • సేవల్లో టెక్నాలజీని వివియోగించుకున్నాం.

    • మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, అనిత ఫీల్డులో బాగా పని చేశారు.

    • సీనియర్ ఆఫీసర్ సిసోడియా కూడా బాగా పని చేశారు.

    • సేవల విషయంలో ఎవ్వరూ ఊహించని విధంగా చేశాం.

      chandrababu-ap-cabinet.jpg

  • 2024-09-25T13:15:10+05:30

    • స్పందించిన మంత్రి నారా లోకేశ్

    • అమరావతి: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి నారా లోకేశ్

    • విశాఖపట్నం సమీపంలో తాటిచెట్లపాలెం వద్ద మంత్రి లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీ

    • ఢీకొనడంతో కారు డ్యామేజీ అయిందని ట్విటర్‌లో మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కళ్యాణ్ భరద్వాజ్

    • స్పందించిన మంత్రి లోకేశ్.. జరిగిన ఘటనకు క్షమాపణ

    • ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా.

    • మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా అని మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

  • 2024-09-25T13:06:43+05:30

    • డ్రగ్స్‌పై ఎన్టీఆర్ కామెంట్స్

    • డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం

    • తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

    • డ్రగ్స్‌కు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటుంది

  • 2024-09-25T12:59:36+05:30

    4 లక్షల మందికి పరిహారం: ఏపీ సీఎం చంద్రబాబు

    • ఇప్పటి వరకు నేను చూడని విపత్త: వరదలపై ఏపీ సీఎం చంద్రబాబు

    • బుడమేరులో ఎన్నడూ చూడని వరద.

    • బుడమేరు కబ్జాకు గురైంది.

    • మరోవైపు కృష్ణా నదిలో పెద్జ ఎత్తున వరద.

    • గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా మోడరైజేషన్ పనులు నిలిపేసింది.

    • ప్రకృతితో ఆటలాడితే ఇలాంటి వరదలు వస్తాయి.

    • గత పాలకుల పాపాలు వరద తీవ్రత పెరిగేందుకు దోహద పడ్డాయి.

    • వరద సమస్య పరిష్కారం కోసం కలక్టరేట్‌లో మకాం వేశా.

    • నాలుగు లక్షల మందికి రూ.602 కోట్లు అందజేశాం: ఏపీ సీఎం చంద్రబాబు

  • 2024-09-25T12:49:38+05:30

    • కస్టడీకి జానీ మాస్టర్

    • 4 రోజుల కస్టడీకి జానీ మాస్టర్

    • శనివారం వరకు కస్టడీ అనుమతించిన రంగారెడ్డి కోర్టు

    • పోక్సో కేసుపై విచారించనున్న నార్సింగి పోలీసులు

    • బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో విచారించనున్న పోలీసులు

  • 2024-09-25T12:42:54+05:30

    ఎర్రమట్టి దిబ్బలు వద్ద పనులు ఆపాలి

    • అమరావతి: ఎర్రమట్టి దిబ్బలు వద్ద జరుగుతున్న పనులు నిలిపేయాలి: ఏపీ హైకోర్ట్

    • ఎర్ర మట్టి దిబ్బలు తవ్వకాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్

    • ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విద్వంసం చేస్తున్న తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి జోన్-1, జోన్-3, వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోకి వస్తుంది

    • సంబంధిత ప్రభుత్వ శాఖలు నుంచి అనుమతి పొందకుండా నేరెళ్ళ వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం:49/1)లో ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివ్ బిల్డింగు సొసైటీ పనులు చేస్తోంది

    • తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి, జియో హెరిటేజ్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలు విరుద్దంగా ఎర్రమట్టి దిబ్బలు (కొండలు) త్రవ్వకాలు జరిపారు

    • జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖలకు నోటీసులు జారీ

  • 2024-09-25T12:35:34+05:30

    దుబాయ్‌లో నాన్న.. అమ్మ ఇక్కడ.. ఏం చేసిందంటే

    • జగిత్యాల: మెట్ పల్లి మండలం జగ్గాసాగర్‌లో దారుణం

    • ప్రియుడితో కలిసి ఉన్న తల్లి, జీర్ణించుకోలేకపోయిన కుమారుడు

    • పురుగుల మందు తాగి ఆత్మహత్య

    • కొడుకు మృతికి తల్లే కారణం అంటోన్న తండ్రి

    • 15 రోజుల క్రితం పురుగుల మందు తాగిన కొడుకు ప్రభాస్

    • దుబాయ్‌లో ఉన్న తండ్రి ప్రతాప్.. హుటాహుటిన స్వగ్రామం చేరిక

    • తల్లిని చితకబాదిన గ్రామస్తులు.. పోలీసుల అదుపులో తల్లి

    • తల్లి పేరు మీద ఉన్న ఆస్తులను తన పేరు మీద మార్చిన తర్వాతే అంత్యక్రియలు అంటోన్న తండ్రి

  • 2024-09-25T11:35:46+05:30

    మీ పరిస్థితి అర్థమైంది కార్తీ

    కార్తీ క్షమాపణలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    సంప్రదాయాలను గౌరవిస్తూ కార్తీ స్పందించిన తీరు సంతోషకరం

    కార్తీ ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని అర్థం చేసుకున్నా

    తిరుపతి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు, భావోద్వేగాలతో ముడిపడిన అంశం

  • 2024-09-25T11:17:59+05:30

    • ఊరట..

    • అమరావతి: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట

    • లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన హైకోర్టు

    • ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు

  • 2024-09-25T11:04:18+05:30

    వర్చువల్‌గా కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

    • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరైన ఎమ్మెల్సీ కవిత

    • సీబీఐ దాఖలు చేసిన చార్జి‌షీట్‌పై కోర్ట్ విచారణ

    • విచారణకు వర్చువల్‌గా హాజరైన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, కేసులోని ఇతర నిందితులు

    • తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా

  • 2024-09-25T10:36:28+05:30

    • తెలంగాణ భవన్ నుంచి ఫతేనగర్ బయలుదేరిన కేటీఆర్ బృందం

    • కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • బీఆర్ఎస్ బృందంతో కలసి ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌టీపీ ప్లాంట్‌ను పరిశీలించున్న కేటీఆర్

    • అనంతరం కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో కేటీఆర్ ప్రెస్ మీట్

  • 2024-09-25T10:28:29+05:30

    నేటి నుంచి గాంధీ భవన్‌లో మంత్రుల ప్రజావాణి కార్యక్రమం

    • పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల రాక

    • నేడు గాంధీ భవన్‌కు వెళ్లనున్న మంత్రి దామోదర రాజనర్సింహ

    • వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్‌కు వెళ్లనున్న మంత్రులు

    • బుధవారం, శుక్రవారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు గాంధీ భవన్‌లో ఉండనున్న మంత్రులు

    • అక్టోబర్ చివరి వరకు మంత్రుల షెడ్యూల్ ప్రకటించిన గాంధీ భవన్ సిబ్బంది

    • ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్న మంత్రులు

  • 2024-09-25T10:26:37+05:30

    కేసుపై తొలిసారి స్పందించిన యూట్యూబర్ హర్షసాయి

    • డబ్బులు కోసం నాపై ఆరోపణలు చేస్తున్నా రు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హర్ష సాయి

    • నా గురించి మీకు తెలుసు.. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి

    • నా తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి దీని గురించి త్వరలో మాట్లాడుతారు

    • హర్షసాయి ఆసక్తికర వ్యాఖ్యలు

    • ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్న పోలీసులు

  • 2024-09-25T10:20:03+05:30

    నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

    • జల్‌పల్లిలో నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ

    • రూ.10 లక్షలతో పారిపోయిన నాయక్ అనే పనిమనిషి

    • నిన్న రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు

    • ఉదయానికల్లా తిరుపతిలో నాయక్‌ను పట్టుకున్న రాచకొండ పోలీసులు

  • 2024-09-25T09:34:37+05:30

    యూట్యూబర్ కేసులో ట్విస్ట్..

    • ‘ మెగా’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి బరితెగింపు

    • ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవరించిన బాధితురాలు

    • కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం

    • బాధితురాలికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డ హర్షసాయి

    • బాధితురాలి వీడియోలు సీక్రెట్‌గా రికార్డు చేసిన హర్ష సాయి

    • సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానంటూ హర్షసాయి బ్లాక్ మెయిల్

  • 2024-09-25T09:26:28+05:30

    యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసుల గాలింపు ముమ్మరం

    • యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదయిన విషయం తెలిసిందే

    • పెళ్లి చేసుకుంటానని‌ నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు

    • నిన్నటి నుంచి అందుబాటులో లేని హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ

    • బాధితురాల నుంచి కొన్ని ఆధారాలు సేకరించిన నార్సింగ్ పోలీసులు

    • మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని కోరిన పోలీసులు

    • హర్ష సాయి నుంచి, అతడి ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పిన బాధితురాలు

    • ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపణ

    • పలుమార్లు తనపై అత్యాచారం చేశాడన్న బాధితురాలు

    • దాడి కూడా చేశాడని ఫిర్యాదు

    • హర్ష సాయి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు

  • 2024-09-25T09:12:19+05:30

    నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

    • వరుసగా రెండో రోజు కూడా సమావేశం కానున్న జీవీఎంసీ కౌన్సిల్

    • మేయర్ గొలగాని హరి కుమారి అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు

    • రాజీనామా చేయాలని కౌన్సిల్‌లో కూటమి సభ్యుల పట్టు

    • అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఇవాళ్టికి వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం

  • 2024-09-25T08:24:24+05:30

    • నేడు సచివాలయానికి రావాలంటూ నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లకు పిలుపు

    • మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవనున్న కార్పొరేషన్ల కొత్త చైర్మన్లు

    • కార్పొరేషన్ చైర్మన్లకు దిశా నిర్దేశం చేయనున్న ముఖ్య మంత్రి

  • 2024-09-25T08:22:46+05:30

    chandrababu-ap-cabinet.jpg

    11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు సీఎం చంద్రబాబు

    • ఇవాళ ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    • విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వరద బాధితులకు నేరుగా నష్టపరిహారం అందించనున్న సీఎం

    • అందరికీ నేరుగా వారి వారి అకౌంట్లలోనే నష్టపరిహారం జమ

    • ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన రెవెన్యూ యంత్రాంగం

    • నేటి నుంచి వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభం

  • 2024-09-25T08:02:06+05:30

    మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు చించివేత

    • ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు చించివేత

    • రేపు జనసేనలో చేరనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

    • బాలినేనికి జనసేనలోకి ఆహ్వానం పలుకుతూ ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు

    • రాత్రి ఫ్లెక్సీలు చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు

  • 2024-09-25T07:49:31+05:30

    విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుల దౌర్జన్యం

    • ఒక వ్యక్తిని కట్టేసి కొట్టిన వైనంపై తీవ్ర విమర్శలు

    • సింగ్ నగర్‌లో టీడీపీ కార్యాలయంలో ప్రతిరోజూ వరద బాధితులకు సాయం అందిస్తోన్న బోండా ఉమ

    • నిన్న రాత్రి సమయంలో టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి

    • తమకు ఎటువంటి వరద సాయం అందలేదని ఆవేదన

    • బోండా ఉమకు ఓట్లు వేసి గెలిపించి తప్పు చేశామన్న బాధితుడు

    • ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బోండా ఉమ అనుచరులు

    • మాటా మాటా పెరగడంతో ఆ వ్యక్తిని ఆఫీస్ వద్ద ఉన్న ఒక స్థంభానికి కట్టేసి కొట్టిన వైనం

    • స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో అతడిని పంపించేసిన అనుచరులు

    • బోండా ఉమ అనుచరుల అత్యాత్సాహంపై సర్వత్రా విమర్శలు

    • సాయం అందలేదని వాదిస్తే దాడి చేస్తారా అంటున్న స్థానికులు

    • బోండా ఉమ కార్యాలయంలో లేని సమయంలో ఈ వివాదం జరిగిందన్న స్థానికులు