AP Flood Victims: వరద బాధితులకు గుడ్ న్యూస్..
ABN , Publish Date - Sep 18 , 2024 | 06:06 PM
AP Flood Victims: ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
AP Flood Victims: ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యానవన పంటలకు జరిగిన నష్ట పరిహారంలో భాగంగా 5 కోట్ల 78 లక్షల 18 వేల రూపాయలను విడుదల చేశారు.
రహదారుల మరమ్మతులకూ నిధులు..
వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో చాలా మేరకు రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ దెబ్బతిన్న రాష్ట్ర హైవేలకు ప్యాచ్ వర్క్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. రూ. 290.40 కోట్లు నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
వెల్లువలా విరాళాలు..
వరద బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. బుధవారం నాడు ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన పలువురు.. ఆయనకు విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.6,01,116 అందజేశారు. అమలాపురానికి చెందిన బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య రూ.5 లక్షలు అందజేశారు. నంద్యాలకు చెందిన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎండీ ఎస్ దినేష్ రెడ్డి, కాలేజీ డీన్ బి సూర్యప్రకాశ్ రెడ్డి రూ.4 లక్షలు అందజేశారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.2,95,000 అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రూ.2,50,000 అందజేశారు. మదనపల్లెకు చెందిన గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎన్.వి రమణారెడ్డి, కట్టా దొరస్వామి నాయుడు రూ.2 లక్షలు అందజేశారు. అనంతపురానికి చెందిన వి సురేష్ నాయుడు రూ.లక్ష అందజేశారు. బీజేపీ మజ్దూర్ విభాగం నాయకులు నాగేశ్వరరావు రూ.10 వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన వారికి మంత్రి నారా లోకేష్ కృతిజ్ఞతలు తెలిపారు.